పీడీఎస్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Sep 9 2025 6:54 AM | Updated on Sep 9 2025 1:41 PM

పలాస: టెక్కలి నుంచి ఒడిశా ప్రాంతానికి వ్యానులో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని కాశీబుగ్గ పోలీసులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రెవెన్యూ అధికారులకు పోలీసులు దాన్ని అప్పగించారు. దీంతో పలాస సివిల్‌ సప్లయ్‌ అధికారి(సీఎస్‌డీటీ) ఎం.తిరుపతిరావు వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్కలి, కోటబొమ్మాళిలో సేకరించిన ఈ బియ్యాన్ని ఒడిశా రాష్ట్రానికి తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో, కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ తన సిబ్బందితో లక్ష్మీపురం టోల్‌ గేటు వద్ద పట్టుకొని వాహనాన్ని సీజ్‌ చేసి తమకు అప్పగించారన్నారు. వాహనంలో మొత్తం 220 బస్తాల్లో సుమారు 10 టన్నుల బియ్యం ఉన్నాయన్నారు. బియ్యాన్ని పలాస ఎంఎల్‌సీ పాయింటు వద్ద అప్పగించి వాహనాన్ని తిరిగి పోలీసుస్టేషన్‌కు పంపిస్తామన్నారు. ఈ విషయాన్ని జిల్లా జాయింట్‌ కలెక్టరుకు చెప్పి తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.

జాతీయ పోటీలకు నడగాం విద్యార్థి

నరసన్నపేట: జాతీయ స్థాయి యోగాసన పోటీలకు మండలంలోని నడగాం గ్రామానికి చెందిన బొత్స మనోహర్‌నాథ్‌ ఎంపికయ్యాడు. డిసెంబర్‌ 27 నుంచి 30వ తేదీ వరకూ రాంచీలో యోగా స్పోర్ట్స్‌ చాంపియన్‌–2025 పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో మనోహర్‌నాథ్‌ పాల్గోనున్నట్లు తండ్రి కేదారనాథ్‌ వెల్లడించారు. సెప్టెంబర్‌ 6, 7వ తేదీల్లో ఏపీ యోగా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలు తిరుమలలో జరిగాయన్నారు. ఈ పోటీల్లో మనోహర్‌నాథ్‌ కాంస్య పతకం సాధించినట్లు వెల్లడించారు. ఈ మేరకు జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ తరుపున పాల్గోనున్నట్లు వివరించారు. కాగా తమ గ్రామానికి చెందిన బాలుడు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంపై గ్రామానికి చెందిన నాయకులు లుకలాపు రవి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు.

ఆటోపై కూలిన తాటి చెట్టు

రణస్థలం: మండలంలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షాలకు రణస్థలం మండల కేంద్రంలోని హైస్కూల్‌ సమీపంలో రామతీర్థాలు రహదారిపై వెళ్తున్న ఆటోపై తాటిచెట్టు విద్యుత్‌ వైర్లతో సహా ఆకస్మాత్తుగా కూలిపోయింది. అయితే అదృష్టావశాత్తు ఆటోలో ఉన్న డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న ప్రయాణిలకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. వర్షం వలన విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో అంతా ఉపిరిపీల్చుకున్నారు.

పీడీఎస్‌ బియ్యం పట్టివేత 1
1/2

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ఆటోపై కూలిన తాటి చెట్టు2
2/2

ఆటోపై కూలిన తాటి చెట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement