
● వ్యవసాయ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో..
టెక్కలి: వ్యవసాయ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా కనిపిస్తోంది. రైతు సేవా కేంద్రాల్లో యూరియా లేకపోవడంతో రైతులంతా ప్రైవేట్ ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సోమవారం కోటబొమ్మాళిలో గ్రోమోర్ సెంటర్ వద్ద యూరియా కోసం రైతులంతా బారులు తీరారు. యూరియా కష్టాలపై మంగళవారం వైఎస్సార్ సీపీ ఆందోళన చేపట్టనున్న నేపథ్యంలో 48 గంటల్లో యూరియా వచ్చేస్తుందని ప్రచారాలు మొదలుపెట్టారు.
రైతుర్యాలీపై పోలీసుల ఆంక్షలు
టెక్కలిలో వైఎస్సార్‌సీపీ తలపెట్టిన రైతు ర్యాలీ కార్యక్రమంపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30 వరకు ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలు చేయకూడదని ఆంక్షలు విధిస్తూ ప్రకటన జారీ చేశారు.