
అన్నదాత పోరును విజయవంతం చేయండి
నరసన్నపేట: రైతులు ఎరువుల కోసం నానా అవస్థలు పడుతున్నారని కనీసం యూరియా కూడా అందక ఇబ్బందులు పడుతున్నారని వారికి మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం ‘అన్నదాత పోరు’ కార్యక్రమం తలపెట్టిందని, దీన్ని జిల్లాలో విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. గడిచిన నెల రోజులుగా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అయినా కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదని అన్నారు. అందుకే జిల్లాలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. పలాస, టెక్కలిలో ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇవ్వాలని, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస, ఎచ్చెర్లల్లో తహసీల్దార్‌లకు వినతి పత్రాలు ఇస్తామని తెలిపారు.