
చిత్తశుద్ధి కొరత
● అధికారుల నిలదీత
● రైతుల అగచాట్లు
కంచిలి మన గ్రోమోర్ కేంద్రం వద్ద రైతులు అగచాట్లు పడ్డారు. ప్రభుత్వం ద్వారా సరపడా ఎరువులు సమయానికి సరఫరా చేయకపోవడంతో, సరఫరా చేసిన కొద్దిపాటి ఎరువుల కోసం రైతుల ఎగబడాల్సిన దుస్థితి ఏర్పడింది. – కంచిలి
● అన్నదాతల ధర్నా
నరసన్నపేట : యూరియా కోసం బారులు తీరిన రైతులు
ఎరువుల కోసం పొలాలను వదిలి
క్యూలలో అన్నదాతల అవస్థలు
నరసన్నపేటలో సోమవారం యూరియా పంపిణీ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మన గ్రోమోర్ సెంటర్‌కు యూరియా వచ్చిందని రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 11 గంటల వరకు క్యూలో ఉన్నా ఒక్క బస్తా కూడా లభించలేదు. దీనికి తోడు అధికార పార్టీ వారు వచ్చి చీటీలు తీసుకెళ్లిపోయారు. ఈలోగా గ్రోమోర్ సెంటర్ షట్టర్లు మూసేయడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బయటకు వచ్చిన ఎస్‌ఐ సీహెచ్ దుర్గప్రసాద్, ఏఓ సూర్యకుమారిలను నిలదీశారు. నరసన్నపేట రైతులకు మాత్రమే ఇక్కడ ఇస్తామని చెప్పగా.. మిగిలిన వారు రైతులు కాదా అని అక్కడున్న వారు ప్రశ్నించారు. –నరసన్నపేట
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
జిల్లా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. పొలం పనుల్లో తీరిక లేకుండా గడపాల్సిన అన్నదాతలు క్యూలో నిలబడి బేజారవుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌లో జిల్లాలో 4.07లక్షల ఎకరాల్లో సాగు జరుగుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ వరి పంటే 4లక్షల 15వేలకు పైగా సాగు అవుతున్నట్లు సమాచారం. దీనికి తోడు ఇతర పంటలు ఉండనే ఉన్నాయి. వరికై తే ఎకరాకు 75 కిలోలు, మొక్కజొన్నకు ఎకరాకు 7 నుంచి 8 బస్తాలు, తోట పంటలకు ఎకరాకు 10 నుంచి 12 బస్తాల యూరియా అవస రం ఉంటుంది. ఈ లెక్కన వరికై తే 30 వేల టన్ను లు, మొక్కజొన్నకు 14వేల టన్నులు, వివిధ రకాల తోటలకు మరో 7వేల టన్నులు అవసరం ఉంటుంది. ఇలా జిల్లాకు 51వేల టన్నులు అవసరం ఉంటుంది. కానీ, ప్రభుత్వం ఇంతవరకు 23 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకొచ్చింది. ఇది ఎటూ సరిపోలేదు.
ప్రణాళిక ఉందా..?
వైఎస్సార్ సీపీ హయాంలో ఏటా 44వేల నుంచి 46వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేసేవారు. రైతుల నుంచి ముందుగా ఇండెంట్ తీసుకునేవారు. ఇప్పుడు ముందస్తు ప్రణాళిక అనేదే లేకుండాపో యింది. సరిపడా యూరియాను తీసుకురావడంలో సర్కారు విఫలమైంది. దానికి తోడు 23వేల మెట్రిక్ టన్నుల యూరియా తీసుకొచ్చినట్టు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ యూరియా కూడా కనిపించడం లేదు. పంపిణీలో రాజకీయం జోక్యం పెరగడంతో పాటు సరుకు బ్లాక్ మార్కెట్‌కు వెళ్లిపోవడంతో యూరియా దొరకడం లేదు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్తా యూరియా కో సం నానా తిప్పలు పడుతున్నారు. ఇదే అవకాశంగా ప్రైవేటు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. రూ. 270కు అమ్మాల్సిన యూరియా బస్తాను ధర పెంచి అమ్ముతున్నారు.
వ్యూహం లేకుండా..
జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించి మూడు జోన్లు ఉన్నాయి. జోన్–1 పరిధిలోని శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌లో ముందు సాగు ప్రారంభం కానుండటంతో ఇక్కడ యూరియా సరఫరా చేయాలి. దీనికి 15 రోజుల్లో జోన్ 2 పరిధిలోని నరసన్నపేట నుంచి నందిగాం వరకు యూరియా సరఫరా చేయాలి. ఇక్కడికి 15 రోజుల్లో జోన్ 3 పరిధిలోని పలాస, ఇచ్ఛాపురం ఏరియాలకు యూరియా సరఫరా చేయాలి. దీనికోసం ముందు ఎరువుల ఇండెంట్ తీసుకుని పక్కాగా సిద్ధం చేయాలి. కూటమి ప్రభు త్వంలో వ్యూహాత్మక కార్యాచరణ కనిపించలేదు.
మాఫియా కుట్రలు...
జిల్లాలో ఆరుగురు హోల్ సేల్ డీలర్లు, 360 మంది రిటైలర్లు ఉన్నారు. జూన్ వరకు వచ్చిన యూరియాలో 50 శాతం ప్రభుత్వ సంస్థలకు ఇవ్వగా, మిగతా 50శాతం ప్రైవే టు వ్యాపారులకు ఇచ్చారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు జిల్లాకు 15 మెట్రిక్ టన్నుల యూ రియా వచ్చింది. వాస్తవంగా ఆ సమయానికి సాగు జరగలేదు. దీంతో ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన యూరియాను కూడా ప్రైవేటు
● తెంబూరులో..
తెంబూరు గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో యూరియా వచ్చిందని రైతులకు తెలియటంతో ఒకేసారి రైతు సేవా కేంద్రానికి తెంబూరు, పెద్దలక్ష్మిపురం, రామచంద్రాపురం, వెంకటాపురం, పెద్ద సరియాపల్లి, ద్వారకాపురం రైతులు వచ్చి బారులు తీరారు. దీంతో వ్యవసాయాధికారులు టోకెన్ ద్వారా యూరి యా అందజేసి, మరో రెండు రోజుల్లో 8.5 మెట్రిక్ టన్నులు వస్తుందని సర్దిచెప్పారు. – పాతపట్నం
వ్యాపారులకే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. జిల్లాలోని అత్యఽధిక మంది డీలర్లు కీలక నేత సోదరుడికి సన్నిహితంగా ఉండటంతో వారు చెప్పిందే వేదంగా నడుస్తోంది. ప్రైవేటుకు అన్ని ఎరువులు వెళ్లిపోయాక ఆ తర్వాత జిల్లాకొచ్చిన యూరియాలో ప్రభుత్వ సంస్థలకు 70శాతం, ప్రైవేటు వ్యాపారులకు 30శాతం కేటాయింపులు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన యూరియాపై రాజకీయ నాయకుల పెత్తనం ఎక్కువ కావడంతో అది కూడా పక్కదారి పట్టింది.
రైతులు బతకొద్దా..?
మాకు తగిన శాస్తే జరిగింది. ఉభాలు వేసి 45 రోజులవుతోంది. ఒక్కసారి కూడా ఎరువు వేయలేదు. ఇంకెప్పుడు వేయాలి. రైతులు బతకొద్దా..? – లక్ష్మణరావు, ముసిడిగట్టు
జిల్లాలో నానాటికీ తీవ్రమవుతున్న ఎరువుల కొరత
గంటల తరబడి క్యూలలో నిలబడుతున్న రైతులు
ఎక్కడికక్కడ ఆందోళనలు, ధర్నాలు
పొలాల్లో ఉండాల్సిన రైతన్నలు క్యూలలో నిలబడుతున్నారు. స్టేషన్లలో ఉండాల్సిన పోలీసులు రైతులకు కాపలా కాస్తున్నారు. ఆర్‌ఎస్‌కేలలో ఉండాల్సిన ఎరువులు అధికార పార్టీ నేతల భవంతులకు వెళ్తున్నాయి. సమాధానం చెప్పాల్సిన నాయకులు అసలు కొరతే లేదని చెబుతున్నారు. ఈ ఖరీఫ్‌కు సర్కారు సాయం లేకుండానే జిల్లాలో వ్యవసాయం జరుగుతోంది. సాగు విస్తీర్ణం మొదలుకుని, ఎరువుల ఇండెంట్ నమోదు వరకు అన్నింటా తీవ్ర నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎరువుల కొరతతో పాటు సర్కారు చిత్తశుద్ధిలోనూ ‘కొరత’ కనిపిస్తోంది.
యూరియా కోసం కొత్తూరు రైతులు సోమవారం పడరాని పాట్లు పడుతున్నారు. సోమవారం తెల్లవారుజాము 6 గంటలకే రైతులు మన గ్రోమోర్ సెంటర్‌కు వచ్చారు. ఏడు గంటల నుంచి యూరియా ఇచ్చారు. కానీ వ్యవసాయ అధికారులు తమకు నచ్చిన వారికి మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. దీంతో గందరగోళం నెలకొంది. సుమారు రూ.1750 ఖరీదు గల పొటాష్ కొంటేనే యూరియా ఇస్తున్నారని కొందరు తెలిపారు. అలికాం–బత్తిలి రోడ్డులో రైతులు ధర్నాకు దిగారు. అధికారులు వెళ్లి యూరియా నిల్వలు ఉన్నాయని వారికి సర్ది చెప్పారు. వారందరినీ స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజి వద్దకు తీసుకు వెళ్లి స్లిప్పులు ఇచ్చి పంపించారు. దీంతో వారు ఆందోళన విరమించారు. గ్రోమోర్ సెంటర్ సిబ్బంది నిర్వాకం వల్ల ఈ ఇబ్బంది వచ్చిందని అధికారులు తెలిపారు. యూరియా పక్కదారి పడుతోందని వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు గండివలస ఆనందరావు ఆరోపించారు. – కొత్తూరు

చిత్తశుద్ధి కొరత

చిత్తశుద్ధి కొరత

చిత్తశుద్ధి కొరత

చిత్తశుద్ధి కొరత

చిత్తశుద్ధి కొరత