నలుగురు వ్యక్తులకు రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

నలుగురు వ్యక్తులకు రిమాండ్‌

Sep 9 2025 6:54 AM | Updated on Sep 9 2025 6:54 AM

నలుగు

నలుగురు వ్యక్తులకు రిమాండ్‌

ఆమదాలవలస: మండలంలోని చిట్టివలస గ్రామానికి చెందిన నవిరి పూర్ణ (22) అనే వివాహిత ఆత్మహత్య కేసులో నలుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి తరలించినట్లు శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. చిట్టివలస గ్రామానికి చెందిన నవిరి సింహాచలం, పద్మ దంపతుల కుమార్తె పూర్ణకు పట్టణంలోని ఐజే నాయుడు కాలనీకి చెందిన సాయిపల్లి మధుసూదనరావుతో ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహమైంది. అయితే పూర్ణను అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధించడంతో కన్నవారింటికి చేరుకుంది. అనంతరం మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆత్మహత్యకు కారణమైన భర్త మధుసూదనరావు, మామ లక్ష్మణ, అత్త సరస్వతీ, మరిది ఈశ్వరరావులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందన్నారు. నలుగురి ముద్దాయిలను స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్‌ఐ ఎస్‌.బాలరాజు పాల్గొన్నారు.

గంజాయితో నలుగురు అరెస్టు

పలాస: ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి నుంచి నెల్లూరుకు అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా పలాస రైల్వేస్టేషన్‌లో ఆదివారం నలుగురు వ్యక్తులను కాశీబుగ్గ పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. వారి నుంచి 6.115 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌లో సోమవారం తెలియజేశారు. దీంతో నెల్లూరు జిల్లా బుజబుజ గ్రామానికి చెందిన సయ్యద్‌ సుల్తాన్‌, బి.అరుణకుమార్‌, ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి గ్రామానికి చెందిన సాయిక్‌ జాఫర్‌, తమిళనాడు రాష్ట్రం అనిస్‌నగర్‌కు చెందిన విచిత్రదేవిలపై కేసు నమోదు చేశామన్నారు.

వీరిలో ముగ్గురిని అరెస్టు చేసి, పలాస జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరుపరిచామన్నారు. వీరి నుంచి గంజాయితో పాటు ఒక సెల్‌ఫోను, రూ.1,020ల నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

నలుగురు వ్యక్తులకు రిమాండ్‌ 1
1/1

నలుగురు వ్యక్తులకు రిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement