
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం పరిధిలోని పెదపాడు పరిసర ప్రాంతం మైస్టోర్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెండువానిపేట గ్రామానికి చెందిన కింజరాపు గంగరాజు(30) అనే వ్యక్తి ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. విధి నిర్వహణకు వెళ్లి ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా, ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న పెదపాడుకు చెందిన ఒక వ్యక్తి ఢీకొన్నాడు. దీంతో గంగరాజు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే స్థానికులు రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడు తండ్రి కింజరాపు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.