
చినుకు పడితే వణుకే..
కంచిలి/నరసన్నపేట : చిన్నపాటి వర్షమొచ్చినా కంచిలి మెయిన్‌రోడ్డు చెరువులా మారుతోంది. పూర్తిస్థాయిలో డ్రైనేజీ లేకపోవడం, కొన్నిచోట్ల పూడికలతో నిండిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఆదివారం కురిసిన వర్షానికి రోడ్డంతా జలమయం కావడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. నరసన్నపేట మేజరు పంచాయతీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నరసన్నపేటలో భూగర్భ డ్రైనేజ్ స్తంభించడంతో వీధుల్లోకి వర్షం నీరు, మురుగు నీరు వచ్చింది. గడ్డెయ్య చెరువు సమీపంలో శివనగర్ కాలనీ తదితర వీధుల్లో ఇళ్లల్లోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికై నా పంచాయతీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

చినుకు పడితే వణుకే..