
విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి
జి.సిగడాం: జాడ పంచాయతీ ముక్కపేట గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ తాలాడ వెంకటరావు(40) విద్యుత్ షాక్‌కు గురై ఆదివారం మృతి చెందాడు. పంట పొలం వద్ద మరమ్మతులు చేసేందుకు విద్యుత్ స్తంభం ఎక్కే సమయంలో షాక్‌కు గురవ్వడంతో అక్కడికక్కడే మత్యువాతపడ్డాడు. ఇతన జాడ, ముషినివలస, సర్వేశ్వరపురం, ముక్కపేట, రౌతుపేట గ్రామాల్లో ప్రయివేట్‌గా విద్యుత్ పనులు చేస్తుండేవాడు. వెంకటరావు మరణవార్త వినగానే భార్య ఉమాహేశ్వరి, పిల్లలు యోగీ, ఉపేంద్రలు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న జి.సిగడాం ఎస్‌ఐ వై.మధుసూదనరావు హవెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.