
కాలువలో పడి వ్యక్తి మృతి
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని వాంబేకాలనీలో కాలువలో పడి ఒక వ్యక్తి మృతి చెందినట్లు ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ శనివారం వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. భార్య, ఇద్దరు పిల్లలతో జొన్నాడ రాజేష్ అనే వ్యక్తి వాంబే కాలనీలో నివసిస్తున్నాడు. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో రాజేష్ వినాయకుని ఊరేగింపునకు వెళ్లాడని.. అటునుంచి వచ్చే క్రమంలో రోడ్డుపక్కనే ఉన్న పెద్ద కాలువలో జారిపడిపోయాడన్నారు. ఎవరూ గమనించకపోవడం.. శనివారం ఉదయాన చనిపోయి ఉండడంతో తమకు సమాచారం వచ్చిందన్నారు. మృతదేహాన్ని రిమ్స్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.