
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
బూర్జ: అండర్–15 బాలికల బ్యాండ్మింటన్ విభాగంలో బూర్జ మండలం గుత్తావల్లి గ్రామానికి చెందిన బొడ్డేపల్లి చైత్రికా కృష్ణ జాతీయ స్థాయికి ఎంపికయ్యింది. రాజాం జీఎంఆర్ ఐటీ కళాశాలలో శుక్ర, శనివారాల్లో జాతీయ స్థాయి బ్యాండ్మింటన్ ఎంపిక పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఆమె ఎంపికై నట్లు తల్లిదండ్రులు శనివారం తెలియజేశారు. చైత్రిక పాలకొండలోని డీఏవీ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. చైత్రిక గతంలోనూ అండర్–13 బాలికల విభాగంలో జాతీయ ఛాంపియన్–23వ సంవత్సరంలో ఘన విజయం సాధించింది. అదేవిధంగా శాప్ బ్యాండ్మింటన్ పొటీల్లో ఉమ్మడి జిల్లా నుంచి అండర్–11, అండర్–13, అండర్–15 విభాగాల్లో వరుసగా మూడు సంవత్సరాలు ఛాంపియన్‌గా నిలిచింది. విజయంపై పాఠశాల ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు అభినందించారు.