జీరో బిజినెస్‌.. | - | Sakshi
Sakshi News home page

జీరో బిజినెస్‌..

Sep 7 2025 7:20 AM | Updated on Sep 7 2025 7:20 AM

జీరో

జీరో బిజినెస్‌..

జీరో బిజినెస్‌.. తక్కువకు కొని ఎక్కువకు అమ్మడమే..

23 ఏళ్ల క్రితం నరసన్నపేటకు చెందిన ఇద్దరు వ్యాపారుల హత్య తాజాగా అదే తరహాలో హత్యకు గురైన గుప్తా ఆందోళనకు గురవుతున్న బంగారం వర్తకులు గుప్తా హత్యకు నిరసనగా బంగారం షాపుల మూత

నరసన్నపేట:

బంగారం వ్యాపారి వెంకట పార్వతీశం గుప్తా హత్య జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఎవరిని నమ్మాలో.. ఎవరిని అనుమానించాలో అర్థం కాని పరిస్థితుల్లో వ్యాపారులు ఉన్నారు. అయితే ఈ సంఘటనకు మూలం వ్యాపారులు జీరో బిజినెస్‌ చేయడమేనని అందరూ అంటున్నారు. అత్యాశకు పోయి అడ్డదారుల్లో వ్యాపారం చేయడం తగదని అంటున్నారు. నమ్మిన వ్యక్తే పథ కం ప్రకారం ఇతరుల సాయంతో గుప్తాను హత్య చేయడం, శ్రీకాకుళం సమీపంలోని రామిగెడ్డలో మృత దేహాన్ని పడేయడం, హత్య జరిగిన 10 రోజుల తర్వాత మృతదేహాన్ని పోలీసులు గుర్తించడం తెలిసిందే. ఈ సంఘటన బంగారం వ్యాపారుల్లో కనువిప్పు తెస్తుందా అనే దానిపై కూడా చర్చ జరుగుతుంది. సరిగ్గా 23 ఏళ్ల క్రితం నరసన్నపేటకు చెందిన నారాయణశెట్టి రవీంద్రనాద్‌ ఠాగూర్‌, గుడ్ల చంద్రభూషణ గుప్తాలు కూడా ఇదే తరహాలో హత్యకు గురయ్యారు. పర్లాకిమిడితో పాటు ఒడిశాలోని పలు ప్రాంతాల్లో బంగారు ఆభరణాలు సేల్‌ చేసి మిగిలిన ఆభరణాలు, సేల్‌ చేయగా వచ్చిన డబ్బుతో నరసన్నపేటకు తిరిగి వస్తుండగా నవతల ఘాటీ వద్ద పర్లాకిమిడికి చెందిన వ్యాపా రులు ఇచ్చిన సమాచారంతో కొందరు దుండగులు అటకాయించి వీరిని హతమార్చి ఆభరణాలు, డ బ్బు తీసుకుపోయారు. మృతదేహాలను బెండి రైల్వే గేటు వద్ద తుప్పల్లో వేసేశారు. రెండు రోజుల తర్వా త సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఇదే తరహాలో గుప్తాను చంపేశారని వ్యాపారులు అంటున్నారు.

నరసన్నపేటలో రిటైల్‌ బంగారం షాపులు 64 ఉన్నాయి. హోల్‌సేల్‌ షాపులు మరో 12 ఉన్నాయి. జిల్లాలో ఐదారు వందల షాపులు ఉన్నాయి. వీటి ల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యాపారం చేస్తున్న వారు కొందరే. మిగిలిన వారందరూ జీరో బిజినెస్‌ చేస్తున్నవారే. కోట్లల్లో వ్యాపారం చేస్తున్నా.. వేలల్లో కూడా ట్యాక్స్‌ కట్టరు. అంతా అక్రమ వ్యాపారమే. ఇటీవల బీఐఎస్‌ అధికారులు వచ్చి నరసన్నపేటలో తనిఖీలు చేపట్టగా హాల్‌మార్క్‌ వ్యవహారం బయ ట పడిన విషయం విదితమే. దీంట్లో భాగంగా గుప్తా కూడా జీరో బిజినెస్‌కు అలవాటు పడి విశాఖ తదితర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు అక్రమంగా(లెఫ్ట్‌) బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి గ్రా ముకు కమీషన్‌ తీసుకుని స్థానికులకు ఆ బిస్కెట్లు అమ్మకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా గడిచిన ఐదారేళ్లుగా ఇదే వ్యాపారంలో ఉన్నాడు. మొదట్లో కొందరు వ్యాపారుల వద్ద ముందుగా డబ్బు తీసుకొనేవాడు. బిస్కెట్స్‌ తెచ్చి ఆ మొత్తానికి ఇచ్చేవాడట. ఏడాది కిందటి నుంచి ఈయనే పెట్టుబడి పెట్టి బిస్కెట్స్‌ తేవడం, కమీషన్‌కు అమ్మకాలు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అదే ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది. విశాఖకు తరచూ వెళ్లే గుప్తా ఎక్కువగా డ్రైవర్‌గా సంతోష్‌నే తీసుకువెళ్లేవాడు. అతని కళ్ల ముందే గుప్తా కోటీశ్వరుడు కావ డం సంతోష్‌కు కంటగింపుగా మారింది. దీంతో పథకం పన్ని ప్రాణాలు తీశాడు. గుప్తాను హత్య చేసిన వారిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని, ఎలాంటి ప్రలోభాలకు పోలీసులు గురికావద్దని స్థానిక వ్యాపారులు కోరుతున్నారు. దీంట్లో భాగంగా నరసన్నపేటలో శనివారం బంగారం షాపులు మూసివేశారు. సాయంత్రం కొందరు వర్తకులు పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించి అనంతరం పోలీసు అధికారులను కలిసి హంతకులకు కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు.

జీరో బిజినెస్‌.. 1
1/1

జీరో బిజినెస్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement