
తలో మాట.. ఎరువులకు తంటా
జిల్లాలో రైతులు యూరియా కోసం అవస్థలు పడుతుంటే నాయకులు, అధికారులు
పరస్పరం విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. యూరియా లేకపోవడం నిజమేనని ఒకరు అంటే.. నిల్వలు ఉన్నాయని మరొకరు
అంటున్నారు. కానీ రైతులు మాత్రం
ఆర్‌ఎస్‌కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద గంటల తరబడి నిలబడి తిట్టి పోస్తుండడం నిజం. జిల్లాకు ఎంత ఎరువు అవసరమో, ప్రభుత్వం ఎంత తెప్పించిందో, రైతు చెంతకు ఎంత
చేరుతుందో అన్నది చిదంబర రహస్యమైపోయింది. –జలుమూరు, శ్రీకాకుళం పాతబస్టాండ్
యూరియా కొరత ఉంది.. రైతులు అవస్థలు పడుతున్నారు. కొన్ని దేశాల్లో యుద్ధాల వల్ల ఈ సమస్య వచ్చింది. ప్రధానంగా ఏప్రిల్, జూన్ నెలల్లో నిల్వ చేయకపోవడం వల్ల ఈ అవస్థ వచ్చింది. అయినా ప్రభుత్వం యూరి యా కొరతకు ప్రత్యామ్నాయం చూపిస్తోంది.
– శనివారం జలుమూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి చేసిన వ్యాఖ్యలివి..