
జె.ఆర్.పురంలో చోరీ
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పంచాయతీ లక్ష్మీనగర్‌లో డేవిడ్‌రాజ్ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పాస్టర్ శ్యాంకుమార్ కుమారుడు డేవిడ్‌రాజ్, కోడలు అరుణకుమారి అద్దె ఇంట్లో ఉంటున్నారు. డేవిడ్‌రాజ్ విశాఖపట్నంలో ఒక ప్రయివేటు కంపెనీలో పని చేస్తూ రెండు రోజులుగా అక్కడే ఉండిపోయారు. కోడలు అరుణకుమారి చీపురుపల్లి మండలం నడిపిల్లిలో అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 3వ తేదీ రాత్రి ఇంటికి తాళం వేసి చీపురుపల్లి మండలం బొండపల్లిలోని కన్నవారింటికి వెళ్లారు. ఇదే అదనుగా గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. డేవిడ్‌రాజ్ తమ్ముడు శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇంటికి వెళ్లి చూడగా తలుపులు తీసి ఉండటం గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మూడు తులాల బంగారం, రెండు లక్షల నగదు, కొన్ని వస్తువులు పోయినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాలు సేకరిస్తున్న క్లూస్ టీం సభ్యులు