
టీచర్లతోనే బంగారు భవిష్యత్
● జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానో త్సవంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కల్చరల్/ శ్రీకాకుళం న్యూకాలనీ/ జి.సిగడాం /మెళియాపుట్టి: భావితరాలకు బంగారు భవిష్యత్ ఇవ్వగలిగేది ఒక్క ఉపాధ్యాయుడే అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియంలో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచర్లతో పాటు తల్లిదండ్రులు తమ పిల్లలను తీర్చిదిద్దాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే వారిలో చాలామంది ఆర్థికంగా వెనుకబడిన వారు ఉంటారని వారిని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. విద్యార్థులకు టీవీ, సెల్ వాడకంపై నియంత్రణ ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ విద్యాభివృద్ధి కోసం తాము ఎంతో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులను అతిథులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు, అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్.శశిభూషణరావు, సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, డైట్ ప్రిన్సిపాల్ గౌరీశంకర్, సాయిప్రసాద్, బెజ్జిపురం యూత్ క్లబ్ నిర్వాహకులు ప్రసాదరావు పాల్గొన్నారు.
విజయవాడలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డులు అందుకుంటున్న టీచర్లు తిమ్మరాజు నీరజ, బూరవెల్లి విజయభారతి, కూర్మాన అరుణకుమారి, లెక్చరర్ రుంకు జనార్దనరావు

టీచర్లతోనే బంగారు భవిష్యత్

టీచర్లతోనే బంగారు భవిష్యత్