
మెడికల్ కాలేజీలపై కూటమి కుట్ర
● ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ ఎక్కడ..?
● వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు అట్టర్ ఫ్లాప్
● ప్రభుత్వ తీరుపై మండిపడిన
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
శ్రీకాకుళం న్యూకాలనీ: పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చారా అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. ఆయన శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పది మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబా బు నిర్ణయించడం దుర్మార్గమని అన్నారు. పీపీపీ విధానం ద్వారా 10 మెడికల్ కాలేజీలను తన వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్రకు తెరతీశారని, తద్వారా వేలకోట్లను దోచుకునేందుకు స్కెచ్ వేశారని దుయ్యబట్టారు.
దార్శనికుడు జగన్..
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టిన దార్శనికుడు మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అనే విషయాన్ని డాక్టర్ సీదిరి గుర్తుచేశారు. గత ప్రభుత్వం హ యాంలోనే రూ.2500 కోట్లు ఖర్చు చేసి, 5 మెడికల్ కాలేజీల భవన నిర్మాణాలు పూర్తయ్యి అడ్మిషన్లు మొదలుపెట్టిన విషయం వాస్తవం కా దా ? అని ప్రశ్నించారు. మరో రూ.6వేలు కోట్లు ఖర్చు చేసి 2025–26, 2026–27 నాటికి మిగిలిన 10 కాలేజీల్లో తరగతులు ప్రారంభించేలా ప్రణాళిక చేశారని, కానీ ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయన్నారు. 15 నెలల్లో రూ.2 లక్షల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం రూ.6వేల కోట్లు వెచ్చించలేదా అని ప్రశ్నించారు. అక్రమాలపై ప్రశ్ని స్తానని చెప్పిన పవన్ కల్యాణ్ వారి పంచనే చేరి రుషికొండలో వేషాలు వేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు పాలన చీకటి రోజులను తలపిస్తోందన్నారు. ఎవరి లబ్ధి కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు పరం చేసి భీమా విధానంలోకి తీసుకువస్తున్నారని ప్రశ్నించారు.
మంత్రిగా తప్పుకో అచ్చెన్నాయుడు..
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయు డు జిల్లా పరువు మంటగలుపుతున్నారని అన్నా రు. యూరియాను సైతం అందజేయలేని దుస్థితి పై కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. పనిచేయడం చేయకాకపోతే వ్యవసాయశాఖ నుంచి తప్పుకో అచ్చెన్నాయుడు అని హితవుపలికారు.
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
పాతపట్నం: గ్రామీణ నిరుద్యోగులకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని ట్రస్ట్ ఇన్‌చార్జి ఎం.రామమూర్తి శుక్రవారం తెలిపారు. పాతపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న వైటీసీలో నాలుగు నెలల పాటు ఉచితంగా హస్టల్, వసతి సౌకర్యం ఉంటుందని, కంప్యూటర్ బేసిక్, ఎంఎస్ ఆఫీస్, స్పోకెన్ ఇంగ్లి ష్, పర్సనల్ డెవలప్‌మెంట్, స్కిల్స్, సోలార్ పీవీ ఇన్‌స్టాల్ కోర్సులకు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. పదో తర గతి పాసై ఉండాలని, 18 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండాలని, దరఖాస్తు చేసుకోవాలని, 105 సీట్లు మాత్రమే ఉన్నాయని, మరిన్ని వివరాలకు 7416321186 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ట్రస్ట్ ఇన్‌చార్జి రామమూర్తి కోరారు.