
అండర్–23 క్రికెట్ జట్టులో హరీష్
హిరమండలం: అండర్–23 విభాగంలో ఓ సంస్థ నిర్వహించే టీ–20 క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియాలో గొట్టా గ్రామానికి చెందిన బత్తుల హరీష్ చోటు సంపాదించాడు. నేపాల్‌లో డిసెంబర్ నుంచి జరగనున్న అంతర్జాతీయ టోర్నీలో హరీష్ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. దీంతో హరీష్‌ను గ్రామపెద్దలతో పాటు గ్రామస్తులు అభినందించారు.
గొంతు కోసుకొని
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పలాస: పలాస కాశీ బుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డుకు చెందిన కోరాడ గవరయ్య (35) మంగళవారం ఉదయం పదునైన చాకుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.
లక్ష్మమ్మకు సత్కారం
వజ్రపుకొత్తూరు: సుమారు 50 ఏళ్లగా ఎంతోమందికి పురుడు పోసిన అంబటి లక్ష్మమ్మ సేవలు వెలకట్టలేనివని విశ్రాంత ఆర్మీ అధికారి కొయిరి ప్రసాదరావు అన్నారు. మంగళవారం వజ్రపుకొత్తూరు మండలం కొత్తపేటలోని చిన్న వీధిలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా లక్ష్మమ్మ సేవలను గుర్తించి ఘనంగా సన్మానించారు. వైద్యం అందుబాటులో లేని సమయంలో ఉద్దాన, తీర ప్రాంత గ్రామాల్లో ప్రసవ వేదనలో ఉన్న ఎంతో మంది గర్భిణులకు అండగా నిలిచి ప్రతికూల పరిస్థితుల్లో తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడారని కొనియాడారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు గాత ముకుందరావు, కె.కొర్లయ్య, కాంతారావు, దాలయ్య, సాధు తదితరులు పాల్గొన్నారు.

అండర్–23 క్రికెట్ జట్టులో హరీష్

అండర్–23 క్రికెట్ జట్టులో హరీష్