
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
టెక్కలి రూరల్: సంతబొమ్మాళి మండలం వడ్డివాడ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మురపాల రెయ్యమ్మ(45) అనే మహిళ మృతిచెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగి రామారావు, మురపాల రెయ్యమ్మలు కలసి ద్విచక్ర వాహనంపై బోరుభద్ర నుంచి సంతబొమ్మాళి వైపు వెళ్తుండగా అదే సమయంలో ముందు వెలుతున్న మరో ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెయ్యమ్మ, రామారావులతో పాటు మరో బైకుపై ఉన్న నెయ్యల రామకృష్ణకు సైతం గాయాలయ్యాయి. ముగ్గురినీ కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రెయ్యమ్మ మృతిచెందింది. సంతబొమ్మాళి ఎస్‌ఐ సింహాచలం మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.