
తూకంలో తేడా వస్తే చర్యలు
గార: నిత్యావసర సరుకుల తూకంలో తేడా వస్తే చర్యలు తప్పవని డీఎస్‌వో జి.సూర్యప్రకాశరావు హెచ్చరించారు. బుధవారం గార తహశీల్దార్ కార్యాలయంలో రేషన్ డిపో డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్‌ఓ మాట్లాడుతూ ప్రతి డిపో వద్ద తప్పనిసరిగా బోర్డులు ఉండాలని, ధరలు, స్టాకు వివరాలు నమోదు చేయాలని సూచించారు. 26 నుంచి దివ్యాంగులకు, వృద్ధులకు ఇళ్లకు వెళ్లి సరుకులు అందజేయాలన్నారు. ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రెండు పూటలా డిపో వద్ద సరుకులు అందజేయాలని సూచించారు. సమావేశంలో తహశీల్దార్ ఎం.చక్రవర్తి, సివిల్ సప్లయ్ డీటీ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.