
పంచాయతీ కార్యదర్శిపై దాడి
నరసన్నపేట: సారవకోట మండలంలోని బుడితి సచివాయంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న డొంకాన శ్రీనివాసరావుపై సోమవారం ఉదయం దాడి జరిగింది. స్వగ్రామం జడూరు నుంచి డ్యూటీకి బుడితి వెళ్తుంగా మార్గమధ్యలో రావాడపేట వద్ద జమ్ము గ్రామానికి చెందిన రుప్ప రాజు ఆయనపై దాడిచేసి గాయపరిచారు. అంతకు ముందు ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం శ్రీనివాసరావుపై రాజు దాడి చేశారు. ఘటనపై నరసన్నపేట ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక వివాహేతర సంబంధం విషయంలో రాజుకి, శ్రీనివాసరావుకు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. దీంట్లో భాగంగానే సోమవారం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
గాయపడిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు