
ఆశ్రమ పాఠశాలల పరిశీలన
పాతపట్నం: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో చదువుకుంటున్న గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీతంపేట ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని లాబర, బొమ్మిక ఆశ్రమ పాఠశాలలను పీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, మరుగుదొడ్లు ప్రతి రోజు శుభ్రం చేయాలన్నారు. విద్యార్థులకు తాగడా నికి వేడి నీరు అందించాలని, మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ప్రధానోపాధ్యాయులు త్రినాథ రావు, సూర్యనారాయణలకు సూచించారు. ఉపాధ్యాయుల బోధన విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీఈఈ బి.సిమ్మన్న, జేఈ సీహెచ్ ప్రసాద రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అర్జీలపై చర్యలు చేపట్టాలి: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: వచ్చిన అర్జీలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జెడ్పీ సీఈఓ, విభిన్న ప్రతిభావంతుల ఇన్‌చార్జి సహాయ సంచాలకులు ఎల్‌ఎ న్‌వీ శ్రీధర్ రాజాను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్వాభిమాన్ దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ లో ఆయనతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వచ్చిన అర్జీలపై తీసుకున్న చర్యలు తెలియజేయాలన్నారు. బ్యాటరీ సైకిల్ కోసం, సదరం సర్టిఫికెట్, పింఛన్లు, హౌసింగ్, ఉపాధి, వినికిడి మిషన్ లపై 17 అర్జీలు స్వీకరించారు. రాష్ట్ర ఉద్యోగుల గ్రీవెన్స్‌పై ఏపీ ఎన్జీఓ నాయకులు హెచ్.సాయిరాం కారుణ్య నియామకాలు, ఉద్యోగులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో కొన్నింటికి మాత్రమే వైద్యం జరుగుతున్నట్లు కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీ రాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మా వతి, జెడ్పీ సీఈఓ, విభిన్న ప్రతిభావంతులు శాఖ ఇన్‌చార్జి ఏడీ ఎల్‌ఎన్‌వీ శ్రీధర్ రాజా స్వీకరించారు.
45.355 మెట్రిక్ టన్నుల ఎరువుల విక్రయాల నిలుపుదల
కంచిలి: కంచిలిలో గల శ్రీ భగవాన్ గుప్తా అండ్ కో రిటైల్ ఎరువుల దుకాణంలో జీఎస్టీలో పొందుపర్చని 45.355 మెట్రిక్ టన్నులు అనగా రూ.7.15 లక్షల విలువైన ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేస్తూ జిల్లా విజిలెన్స్ అధికారులు, వ్యవసాయ అధికారులు ఉత్తర్వు లు జారీ చేశారు. ఈ ఎరువుల దుకాణాన్ని విజిలెన్స్, వ్యవసాయ అధికారుల బృందం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేపట్టింది. ఈ తనిఖీల్లో ఎరువుల అదనపు గోడౌన్స్‌ను జీఎస్టీలో పొందుపరచలేదని గుర్తించారు. గోడౌన్లో ఎరువులు నిల్వ చేయడానికి వీలుగా నేలపై ఊకను వేయాలని తెలియజేసి, జీఎస్టీ పరిధిలోకి రాని ఆ గోడౌన్‌లో ఉన్న ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేశారు. వచ్చిన వారిలో సహాయ వ్యవసాయ సంచాలకులు బి. విజయప్రసాద్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విజిలెన్స్ డిపార్టుమెంట్ ఆడారి సంతోష్‌కుమార్, స్థానిక మండల వ్యవసాయ అధికారి కొంకేణ సురేష్, డిఏఓ ఆఫీస్ నుంచి హాజరైనటువంటి వ్యవసా య సహాయ సంచాలకులు వెంకటరావు, వ్యవసాయ విస్తరణాధికారి సంతోష్ ఉన్నారు.
వంశధార సాగునీరు సాధన కమిటీ పర్యటన
మందస: మందస మండలం దేవపురం గ్రామంలో వంశధార సాగునీరు సాధన కమిటీ సమావేశం జరిగింది. సాగునీటి నిల్వ కోసం రైతులు చాలా ఇబ్బందుల పడుతున్నారని, చెరువును కలుపుకుని సంకు జోడి దామోదర్ గ్రావిటి ద్వారా నీరు అందించవచ్చునని అన్నారు. గ్రామ రైతులు వంశధార సాగునీరు సాధన కమిటీకి తమ వంతు సహకారం ఉంటుందని తెలిపారు.

ఆశ్రమ పాఠశాలల పరిశీలన

ఆశ్రమ పాఠశాలల పరిశీలన