
పరుగులు
పురుగుల
బియ్యంపై
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్‌లో చదువుతున్న పిల్లల కోసం అందించిన పురుగుల బియ్యంపై అధికారుల్లో కదలిక వచ్చింది. ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది. పిల్లలకు పెట్టే భోజనంలో పురుగులా అని ఆశ్చర్యపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ నెల 10వ తేదీన అట్టహాసంగా నిర్వహించబోతున్న మెగా పేరెంట్స్ టీచర్స్ డేలో ఇదొక పెద్ద ఇష్యూ అవుతుందని యంత్రాంగం అప్రమత్తమైంది. యుద్ధ ప్రాతిపదికన పురుగుల బియ్యం సమస్యను పరిష్కరించడానికి శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు ఒకరు చొప్పున టెక్నికల్ అసిస్టెంట్లను కేటాయించి, వారు పాఠశాలలకు వెళ్లి తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఎక్కడైతే పురుగులు కనిపిస్తాయో అక్కడ బియ్యం బ్యాగులను రీప్లేస్ చేయాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి...
మెగా పేరెంట్స్ టీచర్స్ డేను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. దానికోసం పెద్ద ఎత్తు న ఏర్పాట్లు చేయాలని, రికార్డు సృష్టించాలని అధి కారులను ఆదేశించింది. మొన్నటివరకు యోగా డే కోసం ఎలాగైతే యంత్రాంగమంతా రాత్రి పగలనకుండా కష్టపడిందో ఇప్పుడదే విధంగా మెగా పేరెంట్స్ టీచర్స్ డే కోసం కష్టపడుతోంది. ఎలాగైనా రికార్డు సృష్టించాలని ఆరాటపడుతోంది. ఈ సమయంలో పాఠశాలలకు ప్రభుత్వం అందజేసిన సన్నని బియ్యంలో ఎక్కడికక్కడ పురుగులు కనిపిస్తుండటం ఇబ్బందికరంగా మారింది. భోజనాలను పిల్లలు కూడా పడేస్తుండడంతో ఉపాధ్యాయులు సైతం గగ్గోలు పెట్టడమే కాకుండా ఫిర్యాదులు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి.
‘సాక్షి’ కథనాలతో చర్చ..
పురుగుల బియ్యంపై ‘సాక్షి’ పత్రికలో వరుస కథనాలు రావడంతో ప్రజల్లో కూడా చర్చకు దారితీసింది. రాష్ట్ర స్థాయిలో సంచలనమైంది. ఉపాధ్యాయు లే కాదు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ వైఖ రిని దునుమాడుతున్నారు. ఏకంగా అధికారుల గ్రూపుల్లోనే వీడియోలు, ఫొటోలతో సహా పెడుతున్నారు. ఇవన్నీ కథనాల రూపంలో వచ్చినప్పటికీ తొలుత పౌరసరఫరాల అధికారులు తేలిక గా తీసుకున్నారు. వాస్తవం కాదని కొట్టి పారేశారు.
ఫిర్యాదుల వెల్లువ
అయితే పురుగుల బియ్యంపై జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులు రావడంతో పాటు ‘సాక్షి’ లో వచ్చిన
తప్పంతా బడిదేనంట..
మరోవైపు పురుగుల బియ్యం తప్పిదాన్ని ఉపాధ్యాయులపై పౌరసరఫరాల సంస్థ అధికారులు నెట్టేశారు. తప్పు అంతా పాఠశాలలదే తప్ప తమది కాదని తేల్చేశారు. ప్రభుత్వ పాఠశాలలుకు సరఫరా చేసిన బియ్యం బ్యాగులను జాగ్రత్తగా ఉంచకపోవడం వల్లనే పురుగులు వచ్చాయంటూ తప్పించుకుంటున్నారు. సరైన ప్రదేశంలో దాచకపోవడం వల్ల, గాలి చొరబడని సంచుల్లో నిల్వ చేయడం వలన పురుగులు వచ్చాయని పరోక్షంగా ఉపాధ్యాయులను తప్పు పట్టారు. ఇప్పుడిది వివాదస్పదంగా మారింది. బ్యాగు ఇచ్చిందే పౌరసరఫరాల సంస్థ అయితే దాంట్లో ఉపాధ్యాయులకు, పాఠశాలలకు ఏం సంబంధమో వారికే తెలియాలి. కేవలం ఉపాధ్యాయులు, పాఠశాలలను బలి చేసేందుకు ఇలా మాట మార్చేస్తున్నారు.
కథనాలు యంత్రాంగాన్ని ఆలోచనలో పడేశాయి. మెగా పేరెంట్స్ టీచర్స్ డే ముందు సమస్యగా మారుతుందని యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించక తప్పలేదు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కాస్త సీరియస్‌గా తీసుకున్నారు. తక్షణమే ఎంఎల్ ఎస్ పాయింట్ల వారీగా తనిఖీలు చేయాలని, పాఠశాలలకు వెళ్లి బియ్యం బ్యాగులను పరిశీలించాలని టెక్నికల్ అసిస్టెంట్‌లను ఆదేశించారు. జిల్లాలో 14ఎంఎల్‌ఎస్ పాయింట్లు ఉండగా, 14మంది టెక్నికల్ అసిస్టెంట్‌లను నియమించారు. వారికి పాఠశాలలకు సంబంధించిన సమాచారం, ప్రధానోపాధ్యాయుల వివరాలు అందించాలని ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జిలకు ఆదేశించారు. దీంతో టెక్నికల్ అసిస్టెంట్లు రంగంలోకి దిగారు. తనిఖీలు చేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. సోమవారం పలుచోట్ల జరిగిన తనిఖీల్లో కూడా పురుగులు కనిపించాయి. కొన్నిచోట్ల మాత్రం జాగ్రత్త పడి మసిపూసే కార్యక్రమం చేయడంతో అంతా ఓకే అనిపించేశారు.
పురుగులు రావడానికి పాఠశాలలదే తప్పు అని చెబుతూ పౌరసరఫరాల సంస్థ జారీ చేసిన రిజాయిండర్
అధికారుల ముందే..
ఇచ్ఛాపురం టౌన్: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం బియ్యంలో పురుగులను టెక్నికల్ బృందం సోమవారం గుర్తించింది. జిల్లాలో మధ్యాహ్న భోజనపథకం బియ్యంలో పురుగులు ఉండటంతో జిల్లా అధికారుల ఆదేశాలపై ఎంఎల్‌ఎస్ ఇన్‌చార్జి బి.కిశోర్, పరిశీలకులు రేణుక, సీఎస్‌డీటీ సంతోష్‌లు పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజన పథకం బియ్యాన్ని పరిశీలించారు. బియ్యంలో పురుగులు ఉండటంతో బియ్యం నిల్వ చేసే గదిలోకి వెళ్లి పరిశీలించారు. పాత బియ్యంలో పురుగులు ఉండడంతో కొత్త బియ్యం కూడా పాడయ్యాయని తెలిపారు.
‘సాక్షి’లో వరుస కథనాలతో అధికారుల్లో చలనం
మెగా పేరెంట్స్ టీచర్స్ డేలో ఇష్యూ అవుతుందని అప్రమత్తం
తనిఖీలపై కీలక ఆదేశాలు జారీ చేసిన జాయింట్ కలెక్టర్
తనిఖీల్లో కొన్నిచోట్ల బయటపడ్డ పురుగులు
పాఠశాలలదే తప్పు అంటూ పౌరసరఫరాల సంస్థ అధికారుల వింత స్పందన

పరుగులు

పరుగులు