భారీగా మద్యం బాటిళ్లు పట్టివేత | - | Sakshi
Sakshi News home page

భారీగా మద్యం బాటిళ్లు పట్టివేత

May 6 2025 1:24 AM | Updated on May 6 2025 1:26 AM

రణస్థలం: మండలంలోని సంచాం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్రమంగా మద్యం తరలిస్తుండగా జేఆర్‌పురం పోలీసులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి తెలిపిన వివరాల మేరకు అక్రమంగా మద్యం తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు సంచాం జంక్షన్‌ వద్ద పెట్రోలింగ్‌ నిర్వహించారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఒక పల్సర్‌ బైక్‌ మధ్య మూడు అట్టపెట్టెలు పెట్టుకుని వస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో నలువైపుల నుంచి పోలీసులు వాళ్లను వెంబడించి పట్టుకున్నారు. పట్టుబడినవారిలో మీసాల రాము(పండు), గంట్యాడ సాయికుమార్‌లు ఉన్నారు. వివిధ మద్యం షాపుల నుంచి మద్యం కొనుగోలు చేసి సంచాం గ్రామానికి చెందిన బొంతు గణేష్‌ ద్వారా అధిక ఆదాయం కోసం అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 193 మద్యం బాటిళ్లు, ఒక పల్సర్‌ బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. అరైస్టెనవారిని రిమాండ్‌కు తరలించారు.

రోడ్డు ప్రమాదంలో

ఐదుగురికి గాయాలు

రణస్థలం: మండలంలోని కొండములగాం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. జేఆర్‌పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మన్నెల మహాలక్ష్మి, వడ్డి మణికంఠ, మన్నెల వెంకటేష్‌లు కొండములగాం గ్రామంలో సోమవారం ఉదయం ఉపాధి హామీ పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరారు. శ్మశానాల చెరువు దగ్గర నుంచి ఇటుకబట్టీ పక్కనున్న మట్టి రోడ్డు మీదుగా రామతీర్ధాలు తారురోడ్డుపైకి వేగంగా వచ్చారు. అదే సమయంలో కమ్మసిగడాం వైపు నుంచి రణస్థలం వస్తున్న కూల్‌ డ్రింకుల లగేజీ ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు, బైక్‌పై ఉన్న ముగ్గురు గాయపడ్డారు. ముగ్గురు వేతనదారులకు, అటో డ్రైవర్‌ మహంతి రమణకు తొలుత రణస్థలం సామాజిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. తదుపరి ఇద్దరు వేతనదారులు మన్నెల మహాలక్ష్మి, వడ్డి మణికంఠలను శ్రీకాకుళంలో రిమ్స్‌, మరొక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆటోలో ఉన్న మరో వ్యక్తి గొర్లె రమణకు కాలర్‌ బోను విరగడంతో శ్రీకాకుళంలో ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మన్నెల మహాలక్ష్మి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

వీఎంఆర్‌డీఏ

మాజీ అధికారులపై విచారణ

శ్రీకాకుళం(పీఎన్‌ కాలనీ): శ్రీకాకుళంలో తుపాను నీటి కాలువ నిర్మాణంలో అవకతవకలపై వీఎంఆర్‌డీఏ మాజీ అధికారులపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో చిన్న బజార్‌ నుంచి ఇల్లిసిపురం రోడ్డు మధ్య తుఫాను నీటి కాలువ నిర్మాణం చేపట్టారు. ఈ పనుల నిర్వహణ విషయంలో పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి వీఎంఆర్‌డీఏ చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ డి.విజయభారతి, క్వాలిటీ సెల్‌ ఏఈ ఎ.వి.రమణారావు, డీఈఈ జి.శ్యాంసుందర్‌లపై విచారణ చేయాలని నిర్ణయించింది. వీరు 15 రోజుల్లోగా ఈ ఆరోపణలపై రాత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

భారీగా మద్యం బాటిళ్లు పట్టివేత 1
1/1

భారీగా మద్యం బాటిళ్లు పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement