శ్రీకాకుళం కల్చరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఉగాది పురస్కారోత్సవాల్లో భాగంగా 2025 సంవత్సరానికి గాను, శ్రీకూర్మం గ్రామానికి చెందిన శ్రీభాష్యం సుందరరామ కౌండిన్య సీఎం నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా అవార్డు ఆదివారం అందుకున్నారు. కూచిపూడి నాట్యంలో విశేష కృషి చేసినందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. గత 25 ఏళ్లుగా కౌండిన్య రఘుపాత్రుని శ్రీకాంత్ వద్ద కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందుతున్నారు.
డా.బీఎస్‌వీ ప్రసాద్‌కు పురస్కారం
కవిటి: రాష్ట్రస్థాయిలో ఈ ఏడాది ప్రకటించిన ఉగాది పురస్కారాలకు గానూ కవిటి మండలం కుసుంపురం గ్రామానికి చెందిన డాక్టర్ బొంతలకోటి సత్యవరప్రసాద్‌కు కళా విభాగంలో అవార్డు వరించింది. ఆదివారం విజయవాడలో జరిగిన వేడుకల్లో సీఎం చేతులమీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం సత్యవరప్రసాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఉగాది పురస్కారాలు ..
ఉగాది పురస్కారాలు ..


