బదిలీ కోసం ఎమ్మెల్యే సిఫార్సు లేఖ లేకుంటే ఉద్యోగి పరిస్థితి ఏమిటా..? అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు ఎమ్మెల్యేల వద్ద నుంచి ిసిఫార్సు లేఖలు తీసుకుని వారి వారి ప్రయత్నాలు ప్రారంభించి డ్వామా అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీన్నే కొందరు ఎమ్మెల్యేలు క్యాష్ చేసుకుంటున్నారు. బదిలీల సిఫార్సు లేఖల ముసుగులో చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పైరవీలకు తావిచ్చేలా అధికారులు సూచించడంతో ఉపాధి హామీ పథకం ఉద్యోగుల పరిస్థితి దయానీయంగా తయారైంది. ఎమ్మెల్యేలు లేఖలు ఇచ్చారంటే భవిష్యత్లో వారు చెప్పినట్లు తప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని అంతర్మథనం చెందుతున్నారు.