
ఎస్‌ఎంసీ తీర్మానాలపై రగడ
● బలవంతంగా వెనక్కు తీసుకునేలా కూటమి సర్కారు కుట్రలు
● చైర్మన్, గ్రామపెద్దలతో మంతనాలకు విద్యాశాఖ అధికారులు సిద్ధం
● తప్పుపడుతున్న విద్యా, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల ప్రతినిధులు
● పాఠశాల విద్యను నిర్యీరం చేస్తున్నారని మండిపాటు
స్నేహితులకు ప్రైవేటు పాఠశాలలు ఉండటం వల్ల ప్రభుత్వ పాఠశాలలను విచ్ఛిన్నం చేసే ఈ కుట్రలో భాగం కానున్నారని.. వారి వల్లే ప్రభుత్వ పాఠశాలలకు ఈ దుస్థితి పట్టిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, ఎంఈఓలు అత్యుత్సాహంతో ఉన్నత స్థాయి అధికారుల వద్ద మెప్పు కోసం నిబంధనలను పక్కనపెట్టి.. భారీగా ఉన్నత తరగతులను సమీప పాఠశాలలకు తరలిస్తున్నారు. ఇక్కడ స్థూలంగా గమనిస్తే (నేచురల్ బేరియర్స్) భౌగోళిక అడ్డంకులను అధికారులు అసలు పట్టించుకోవడంలేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
తప్పుపడుతున్న విద్యావేత్తలు, తల్లిదండ్రులు..
ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు, పిల్లలకు న్యాయం చేయాల్సిన అధికారులు ఈ రకంగా వ్యవహరించడాన్ని విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. మూడో తరగతి కోసం 2, 3 కిలోమీటర్లు., ఆరో తరగతి కోసం 5, 6 కిలోమీటర్లు తమ పిల్లలను ప్రతిరోజు బడికి ఎలా పంపించాలని, వారు ఎలా వెళ్తారని ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్‌కు తలోగ్గి తమ పిల్లలకు చదువును దూరం చేయాలనే దుర్మార్గపు ఆలోచనలను కూటమి సర్కారు వీడాలని కోరుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ తప్పుడు ఆలోచనలను విరమించుకొవాలని.. ప్రస్తుతం ఉన్న మాదిరిగానే పాఠశాలలను కొనసాగిస్తూ విద్య కొనసాగించాలని.. లేనిపక్షంలో న్యాయ పోరాటానికి సిద్ధమౌతామని హెచ్చరిస్తున్నారు. తీర్మానాల కోసం అధికారులు బలవంతంగా ఒత్తిడి తీసుకొస్తే వారిపై కూడా కేసులు పెడతామని స్పష్టం చేస్తున్నారు.
శ్రీకాకుళం న్యూకాలనీ :
పాఠశాల విద్యను కూటమి ప్రభుత్వం గందరగోళానికి నెట్టేందుకు సరికొత్త కుట్రలకు తెరతీస్తోంది. తాము అనుకున్న కార్యాన్ని పూర్తిచేసేందుకు అధికారులనే అస్త్రాలుగా వాడుకోవాలని చూస్తోంది. పాఠశాల విద్యాకమిటీ(ఎస్‌ఎంసీ) ఇచ్చిన తీర్మానాలను వెనుక్కి తీసుకునేలా అధికారుల నుంచే ఒత్తిళ్లు చేసేలా కుయుక్తులకు తెరతీసింది. కార్పొరేట్ వ్యవస్థకు తలొగ్గి.. పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూళ్ల పేరిట దగా చేసేందుకు సిద్ధమౌతోంది. బలవంతంగా ప్రాథమిక పాఠశాల నుంచి 3,4,5 తరగతులను, ప్రాథమిక ఉన్నత పాఠశాల నుంచి 6,7,8 తరగతులను దూరంతో సంబంధం లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా.. సమీప ఆవాస ప్రాంతాలకు తరలించడానికి సన్నాహాలు చేస్తోంది. అందుకోసం న్యాయపరమైన అడ్డంకులు లేకుండా గతంలో తమ పాఠశాలలోని ఉన్నత తరగతుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఇచ్చిన తీర్మానాలను వెనక్కి తీసుకోమని బలవంతం చేస్తోంది.
తీర్మానాలను ఏ మార్చేలా..
వాస్తవానికి 117 సవరణ జీవో ద్వారా కూటమి సర్కారు తీసుకొచ్చిన దుర్మార్గపు విద్యా సంస్కరణలను తీవ్రంగా వ్యతరేకిస్తూ మార్చి 1న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ(ఎస్‌ఎంసీ) సమావేశాల్లో.. తమ పాఠశాలను యథాతధంగా కొనసాగించాలని, పాఠశాలలోని ఉన్నత తరగతులు తరలించకూడదని పేర్కొంటూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. వాటిని అధికారులకు అందజేశారు. అయితే ఏయే కమిటీలు తరగతులను యథాతధంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశాయో.. ఆయా పాఠశాల లేదా ఆవాస ప్రాంత విద్యా కమిటీ చైర్మన్, సభ్యులు, గ్రామ పెద్దలను ఈ రెండు మూడు రోజల్లో ఎంఈఓ ఆఫీసులకు పిలిపించి తీర్మానాలను వెనక్కి తీసుకొని.. ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా తీర్మానాలు ఇమ్మని ఒత్తిడి తీసుకురానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో అధికారుల ఒత్తిడికి తలొగ్గని పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీలతో ఎమ్మెల్యే వద్దకు పంచాయితీ పెట్టి ఒప్పించే ప్రయత్నం చేయడానికి రూట్‌మ్యాప్ సిద్ధం చేసినట్టు తెలిసింది.
ఎమ్మెల్యేలు, అధికారుల అత్యుత్సాహం..
జిల్లాలో ఓ శాసనసభ్యుడికి సొంత ప్రైవేట్ పాఠశాల ఉండటంతో తన స్కూల్ అభివృద్ధి కోసం.. తెరవెనుక కుయుక్తులు పన్నతున్నట్టు ఆ మండల పరిధిలోని ఉపాధ్యాయులు చెప్పుకుంటున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు వారి బంధువులకు,

ఎస్‌ఎంసీ తీర్మానాలపై రగడ