● ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్‌రెడ్డి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని, దానిలో భాగంగానే ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జీఓ సైతం ఇచ్చిందని, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ దోసకాయల శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పూర్తిస్థాయి ప్రణాళికలతో కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని డీసీ అన్నారు. గురువారం డీసీ సమక్షంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో గీత, సొండి కులాల వారికి మద్యం షాపుల కేటాయింపు లాటరీ పద్ధతిలో జరిగిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సారాయి కేంద్రాలను ఎ, బి, సి క్యాటగిరీలుగా విభజించామని తెలిపారు. మన జిల్లాలో ఇప్పటికే ఆరు ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో 110 పాయింట్లను ఎస్‌హెచ్‌ఓలు గుర్తించారన్నారు. సారాయిని కాసే గ్రామాల్లోని వ్యక్తులను గుర్తించడమే కాక ఆయా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే నల్లబెల్లం వ్యాపారులు, సారాయి క్రయ, విక్రయాలు, కాసేవారు, పాతముద్దాయిలను గుర్తించామన్నారు. జిల్లాలో వేయిమందికి పైగా ఇలాంటి కేసుల్లో అనుమానితులుగా ఉన్నారని, వీరిలో 700 మందికి పైగా (70 శాతం) బైండోవర్లు కట్టామన్నారు. ఇప్పటికై నా సన్మార్గంలో నడవాలని, లేదంటే గట్టి చర్యలుంటాయని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు.