నదుల అనుసంధానానికి కేటాయింపులేవీ? | - | Sakshi
Sakshi News home page

నదుల అనుసంధానానికి కేటాయింపులేవీ?

Mar 7 2025 9:18 AM | Updated on Mar 7 2025 9:15 AM

కవిటి: వంశధార, బాహుదా నదుల అనుసంధానానికి తాజా బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులు చేయకపోవడం దారుణమని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. గురువారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే, నదులను అనుసంధానం చేసే కార్యక్రమాలు చేపడతామని ఎన్నికల ముందు అట్టహాసంగా ప్రకటనలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆ విషయాన్నే విస్మరించడం సరికాదన్నారు. ముఖ్యంగా ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలకు, రైతాంగానికి ఎంతో అవసరమైన వంశధార నది జలాలను బాహుదాకు అనుసంధానం చేసేందుకు బడ్జెట్లో ఒక రూపాయి కూడా కేటాయింపులు చేపట్టకపోవడం అన్యాయమన్నారు. కేవలం వర్షాధారం మీదే వ్యవసాయ రంగం కొనసాగుతోందన్నారు.

10న అప్రెంటీస్‌ మేళా

ఎచ్చెర్ల క్యాంపస్‌ : ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 10న ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటీస్‌ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ ఎల్‌.సుధాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఈ మేళాకు హాజరవుతారని చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి రిజస్ట్రేషన్‌ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఆధార్‌, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని కోరారు.

భక్తుడిపై

దాసుడి దురుసు ప్రవర్తన

సంతబొమ్మాళి: తక్కువ డబ్బులు పల్లెంలో పెట్టానని ఆగ్రహిస్తూ సంతబొమ్మాళి మండలం హనుమంతునాయుడుపేట పంచాయతీ పోతునాయుడుపేట గ్రామానికి చెందిన రెయ్యమ్మ దాసుడు (పరపటి రాము) తనపై దాడి చేశాడని టెక్కలి మండలం బొరిగిపేట గ్రామానికి చెందిన రోణంకి ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశాడు. గురువారం దాసుడి వద్దకు వెళ్లి పళ్లెంలో పండ్లు, రూ.50 పెట్టగా.. ఇంత తక్కువ ఇస్తావా అంటూ ఆగ్రహిస్తూ పండ్లు, డబ్బులను బయటకు విసిరేశాడని, ఇదేంటని ప్రశ్నిస్తే దాడిచేసి సెల్‌ఫోన్‌ లాక్కున్నాడని వాపోయాడు. సెల్‌ఫోన్‌ తిరిగిచ్చేయాలని కోరితే అనుచరులు బయటకు గెంటేశారని, కొంతసేపటి తర్వాతే తిరిగిచ్చారని చెప్పాడు. కాగా, ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు ఆరా తీశారు.

బార్‌ కౌన్సిల్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయవాదుల బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ గురువారం విడుదలైంది. ఏడాదికి ఒకసారి జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను ప్రస్తుత అధ్యక్ష, కార్యదర్శులు కె.ఈశ్వరరావు, వై.ప్రసన్నకుమార్‌ ప్రకటించారు. ఈ నెల 10న ఎన్నికల అధికారిని నియామకం, 17న నామినేషన్ల స్వీకరణ, 19న నామినేషన్లు పరిశీలన, 20న నామినేషన్ల ఉపసంహరణ, 21న పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు. 27న ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పోలింగ్‌ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారు. కార్యవర్గంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి, మహిళా ప్రతినిధులు తదితర సభ్యులను ఎన్నుకుంటారు.

మహిళాభ్యున్నతికి తోడ్పాటు

శ్రీకాకుళం అర్బన్‌ : మహిళాభ్యున్నతికి నాబార్డు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక శక్తిగా ఎదగాలని నాబార్డు డీడీఎం కె.రమేష్‌ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలో నాబార్డు, ఐసీడీఎస్‌ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గురువారం ఐసీడీఎస్‌ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం, స్వయం ఉపాధి అభివృద్ధి అంశాలపై మహిళలు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ బి.శాంతిశ్రీ, డీఆర్‌డీఏ డీపీఎం ఏ.శ్రీగౌరి, సీఐ టి.త్రినేత్రి, కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్‌ అనూష, డాక్టర్‌ వి.సునీత, సీడీపీవో శోభారాణి, డీసీసీబీ మేనేజర్‌ సంధ్యారాణి, ఝాన్సీ, లలిత, ఎఫ్‌పీఓలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

నదుల అనుసంధానానికి కేటాయింపులేవీ?   1
1/2

నదుల అనుసంధానానికి కేటాయింపులేవీ?

నదుల అనుసంధానానికి కేటాయింపులేవీ?   2
2/2

నదుల అనుసంధానానికి కేటాయింపులేవీ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement