
● వేర్వేరు చోట్ల చెరువులో కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్ద
చల్లా రామారావు
(ఫైల్)
కిట్టాలపాడు పోలయ్య
(ఫైల్)
పండగ పూట విషాదం
సారవకోట: మండలంలోని రెండు గ్రామాల్లో శనివారం వినాయక చవితి పండగ పూట విషాదం అలముకుంది. చవితికి పూజలు చేసేందుకు కలు వ పువ్వుల కోసం చెరువులో దిగి నీట మునిగి ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. చిన్నకిట్టాలపాడు పంచాయతీ వెంకంపేట గ్రామానికి చెందిన కిట్టాలపాడు పోలయ్య (46) గ్రామంలో ఉన్న కోనేరులో కలువ పువ్వుల కోసం వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ఉదయం కొండ నుంచి పత్రి తీసుకొచ్చి గ్రామంలో పంచి అనంతరం చెరువులో కలువ పువ్వుల కోసం చెరువులోకి దిగి నీట మునిగి మృతి చెందాడు. అప్పటి వరకు తమకు పత్రి పంచిపెట్టి నీట మునిగి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడికి భార్య సావిత్రి, కుమారుడు సాయి కిరణ్, కుమార్తె స్నేహప్రియ ఉన్నారు. అలాగే నౌతళ గ్రామానికి చెందిన చల్లా రామారావు (48) గ్రామానికి సమీపంలో ఉన్న నీట గుంటలో కలువ పువ్వుల కోసం వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. మృతుడికి భార్య నారాయణమ్మ, కుమారుడు సురేష్, కుమార్తె లక్ష్మి ఉన్నారు.

● వేర్వేరు చోట్ల చెరువులో కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్ద