కిడ్నీ ఆస్పత్రి ప్రారంభ తేదీలో మార్పు | Sakshi
Sakshi News home page

కిడ్నీ ఆస్పత్రి ప్రారంభ తేదీలో మార్పు

Published Sat, Nov 11 2023 12:38 AM

మంత్రి ధర్మాన సమక్షంలో పార్టీలోకి చేరిన పాత్రునివలస గ్రామస్తులు   - Sakshi

కాశీబుగ్గ: పలాసలో రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభ తేదీ మార్పు చేస్తున్నట్లు మంత్రి క్యాంప్‌ కార్యాలయం నుంచి సమాచారం వెలువడింది. ఈ నెల 23వ తేదీ గురువారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పలాస రావాల్సి ఉండగా అదే రోజు ఏకాదశి సందర్భంగా ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందని భావించి 25, లేదా 29 తేదీలను ప్రారంభానికి పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

శ్రీకూర్మనాథాలయ హుండీల ఆదాయం రూ. 12,26,382

గార: శ్రీకూర్మనాథాలయంలోని హుండీలను శుక్రవారం తెరచి లెక్కించగా రూ. 12,26,382 లు వచ్చిందని ఆలయ ఈఓ జి.గురునాథం తెలిపారు. శ్రీకూర్మనాథాలయంతో పాటు ఉపాలయమైన పాతాళ సిద్ధేశ్వరస్వామి ఆలయ హుండీలను తెరిచి లెక్కించారు. నగదుతో పాటు కిలో 224 గ్రాముల వెండి కూడా లభ్యమైంది. కార్యక్రమంలో జీవీబీ రవికుమార్‌, పాలకమండలి సభ్యులు డబ్బీరు శ్రీనివాసరావు, అనుపోజు నాగరాజు, జి.లక్ష్మణాచార్యు లు, ఎస్‌.పద్మనాభాచార్యులు పాల్గొన్నారు.

మల్లన్న ఆలయం హుండీ ఆదాయం లెక్కింపు

టెక్కలి: టెక్కలి మండలం రావివలస ఎండల మల్లికార్జునస్వామి ఆలయం హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. పాతపట్నం నీలమణిదుర్గ ఆలయం ఈఓ టి.వాసుదేవరావు, మల్లన్న ఆలయం ఇన్‌చార్జి ఈఓ జి.ప్రసాద్‌బాబు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌ ఎస్‌.సుధాకర్‌ పర్యవేక్షణలో హుండీ ఆదా యాన్ని లెక్కించారు. మొత్తం రూ.1,35,103 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే ఆలయంలో స్వామి వారికి భక్తులు సమర్పించే తల నీలాల హక్కు కోసం బహిరంగ వేలం నిర్వహించారు. ఏలూరుకు చెందిన తమ్మన శివప్రవీణ్‌ ఏడాది కాల పరిమితికి రూ.2,15,000కు వేలం పాటతో తల నీలాల హక్కును సొంత చేసుకున్నారు.

పార్టీ గెలుపునకు

కృషి చేయండి

శ్రీకాకుళం రూరల్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ వివరించాలని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్‌ స్టాంప్స్‌ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. పెదపాడులోని ధర్మాన క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం రాత్రి పలువురు యువకులు మంత్రిని కలిసి పార్టీలోకి చేరారు. ప్రతి ఒక్కరికీ పార్టీ కండువా వేసి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన గెలుపునకు అంతా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో బాణాల దాలినాయుడు, బాణాల రామినాయుడు, తదితరులు ఉన్నారు.

 హుండీల ఆదాయాన్ని లెక్కిస్తున్న దృశ్యం
1/1

హుండీల ఆదాయాన్ని లెక్కిస్తున్న దృశ్యం

Advertisement
 
Advertisement