పలాస నటుడికి నంది పురస్కారం | - | Sakshi
Sakshi News home page

పలాస నటుడికి నంది పురస్కారం

Sep 18 2023 12:32 AM | Updated on Sep 18 2023 12:32 AM

ప్రముఖుల నుంచి నంది పురస్కారం 
అందుకుంటున్న సినీ నటుడు కుమార్‌ నాయక్‌ 
 - Sakshi

ప్రముఖుల నుంచి నంది పురస్కారం అందుకుంటున్న సినీ నటుడు కుమార్‌ నాయక్‌

పలాస: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ సారస్వత్‌ పరిషత్‌ ఆవరణలో ఆర్‌కే కళా సాంస్కృతిక ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పలాస–కాశీబుగ్గకు చెందిన డాక్టర్‌ కుమార్‌ నాయక్‌కు నంది పురస్కారం లభించింది. ఈ సందర్భంగా సెంట్రల్‌ ఫిల్మ్‌ సెన్సా ర్‌ బోర్డ్‌ సభ్యులు మోగులపల్లి ఉపేంద్ర, ప్రముఖ బెంగాలీ సినీ నటి నిషా ప్రాన్సిస్‌, తెలంగాణ తమిళ కన్నడ సినీనటి ఖుషి పూరి చేతులు మీదుగా స్వర్ణకంకణ, నంది పురస్కారం అందుకున్నారు. వాడు ఎవడు, ఓ కౌన్‌ హై హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌లో సినిమా విడుదలైన సందర్భంగా అందులో కుమార్‌ నాయక్‌ తనదైన శైలిలో ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డు అభించింది. వీరగున్నమ్మ, సురభి70 ఎంఎం, నాకొక శ్రీమతికావాలి, పలాస 1978, రెండక్షరాల ప్రేమ తదితర చిత్రారాల్లో కుమార్‌ నాయక్‌ నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement