
అవగాహన కల్పిస్తున్న ఎనర్జీ ఆడిటర్ మూర్తి
అరసవల్లి: రైతులు సమర్థవంతంగా విద్యుత్ వినియోగించుకోవాలని, అందుబాటులో ఉన్న సాంకేతికతను వాడుకోవాలని ఎనర్జీ ఆడిటర్ (ఆడిటెక్) టీఎస్‌ఎన్ మూర్తి సూచించారు. ఆయన శుక్రవారం విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో సమర్థవంత విద్యుత్ వినియోగంపై రైతులకు, పంపుసెట్ల టెక్నీషియన్లకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా సర్కిల్ కార్యాలయంలో టెక్నీషియన్లకు, అంబేడ్కర్ ఆడిటోరియంలో పంపుసెట్ల రైతులకు అ వగాహన కల్పించారు. విద్యుత్ ఎలా ఆదా చేయాలి, వృధా ఎలా అరికట్టాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. పాడైన పంపుసెట్లను అలా వదిలేయకుండా ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తే కొత్త పంపుసెట్ల ను పొందేలా పథకాలున్నాయని గుర్తుచేశారు. బోర్‌వెల్ వాటర్ కండీషనర్లు, మాగ్నెటిక్ యాక్టివైజర్ల వంటి పరికరాల గురించి వివరించారు. రైతులు, టెక్నీషియన్లు సమన్వయంతో నాణ్యమైన విద్యుత్ పరికరాలు, మోటార్లను కొనుగోలు చేసుకోవాలని సూ చించారు. సోలార్ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వా లని, సోలార్ పంపుసెట్లకు కేంద్ర ప్రభుత్వం తాజా గా 65 శాతం సబ్సిడీ ఇచ్చేలా ప్రధాని మోదీ ఇటీవలే ప్రకటించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలోనే స్మార్ట్ మీటర్లను అమర్చారని, ఇది ఎంతో లాభదాయకమన్నారు. ఈ మీటర్లతో విద్యుత్ ఆదా పొందవచ్చునన్నారు. అవగాహన కార్యక్రమంలో పంపుసెట్ల టెక్నీ షియన్లతో పాటు రైతులు, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఎల్.దైవప్రసాద్, ఈఈలు ఎల్‌సిహెచ్ పాత్రుడు, బయ్యన్నాయుడు, గోపాలకృష్ణ, ఎఈ జె.సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.