ధర్మవరం అర్బన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 1న జిల్లా కేంద్రంలో చేపట్టనున్న రణభేరి 3.0ను జయప్రదం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ఆదివారం యూటీఎఫ్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శెట్టిపి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ పీఆర్‌సీ కమిషన్ ఛైర్మన్‌ను వెంటనే నియమించాలని, 29 శాతం ఐఆర్ వెంటనే ప్రకటించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, ఉద్యోగుల, పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు రూట్ మ్యాప్ ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణనాయక్, జిల్లా కార్యదర్శి అమర్‌నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


