రంజాన్‌కు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

రంజాన్‌కు సర్వం సిద్ధం

Mar 21 2026 5:26 AM | Updated on Mar 21 2026 5:26 AM

నెలవంక కనిపించడంతో ముస్లింలు ఉపవాస దీక్షలను విరమించారు. సత్య నిష్ట, ధర్మాచరణ, దానధర్మాలు, ఉపవాసాలతో సాగిన రంజాన్‌ మాసం ముగియడంతో శనివారం పండుగ జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు జిల్లా అంతటా రంజాన్‌ వేడుకలకు మసీదులు, ఈద్గాలలో ఏర్పాట్లు చేశారు. నెలరోజుల ఉపవాస దీక్షల్లో చివరిరోజు శుక్రవారం ఇఫ్తార్‌ వేళ మసీదులన్నీ ముస్లింలతో రద్దీగా మారాయి. మసీదుల ఇమామ్‌లు, మౌజన్లు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. కుల మతాలకతీతంగా ఇఫ్తార్‌ విందు ఇచ్చి ఐక్యత చాటిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

– సాక్షి బృందం, శ్రీసత్యసాయి జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement