హైవేకు మరమ్మతులు
పరిగి: మండలంలోని నేతులపల్లి సమీపంలో కొడికొండ చెక్‌పోస్టు నుంచి కర్ణాటకలోని శిర వరకు నిర్మించిన 544ఈ జాతీయ రహదారిపై మరమ్మతు పనులను హైవే అథారిటీ అధికారులు చేపట్టారు. జాతీయ రహదారి దెబ్బతిని వాహనాల రాకపోలకు ఇబ్బందిగా మారిన అంశంపై ‘నేషనల్ హైవే.. నాలుగేళ్లకే శిథిలం’ శీర్షికతో ఆదివారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై హైవే అథారిటీ అధికారులు స్పందించారు. ఆదివారం జయమంగళ నదిపై నిర్మించిన వంతెనపై ఏర్పడిన గోతులకు ప్యాచ్ వర్క్ చేశారు.
వ్యక్తి ఆత్మహత్య
రొద్దం: మండలంలోని తురకలాపట్నం గ్రామానికి చెందిన చాకిల బైలాంజినప్ప (48) ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కాగానొక్క కుమార్తె 2020లో అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి కుమార్తైపె దిగాలుతో ఉండేవాడు. పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. చివరకు మద్యానికి బానిసై ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జాతీయ సమైక్యత శిబిరానికి ఎంపిక
హిందూపురం టౌన్: స్థానిక ఎన్‌ఎస్‌పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న జి.ఫరీదా జాతీయ సమైక్యతా శిబిరానికి ఎంపికై నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ప్రగతి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం కళాశాలలో విద్యార్ధిని ఫరీదాను అభినందించారు. ఈ నెల 28వ తేదీ వరకూ తెలంగాణలోని మల్కాజ్ గిరి జిల్లాలో ఉన్న ఎంఎల్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో వారం రోజుల పాటు జాతీయ సమైక్యతా శిబిరం జరగనుంది. ఎస్కేయూ ఎన్‌ఎస్‌ఎస్ విభాగం నుంచి ఏపీ తరఫున ఫరీదా పాల్గొని రాష్ట్ర సంస్కృతీసంప్రదాయాలను వివరించనున్నారు. ఫరీదాను ఐక్యూఏసీ కోఆర్డినేటర్ శ్రీలక్ష్మి, అధ్యాపకులు రవినాయక్, ఎన్‌ఎస్‌ఎస్ పీఓ రంగనాయకులు, సీనియర్ అసిస్టెంట్ నరసింహులు, కళాశాల సిబ్బంది అభినందించారు.
12వ పీఆర్సీని
నియమించాలి
● ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ డిమాండ్
పుట్టపర్తి అర్బన్: తక్షణమే 12 వేతన కమిషన్‌ను నియమించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు 30 శాతం ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం కొత్తచెరువులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కోడూరు శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రవికుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగుల, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని మండిపడ్డారు. 11వ పీఆర్సీ గడువు ముగిసి రెండేళ్లయినా 12వ పీఆర్సీని నియమించకుండా చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనంకి అశోక్‌కుమార్ మాట్లాడుతూ... పదో తరగతి పరీక్షల దృష్ట్యా 100 రోజుల యాక్షన్ ప్లాన్ పర్యవేక్షణకు విద్యాశాఖేతర శాఖల అధికారులను నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇది ఉపాధ్యాయులను అవమానపరచడమేనన్నారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను సెలవు దినాలకు మినహాయింపు ఇవ్వాలన్నారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు పరిశీలకులుగా రాష్ట్ర కార్యదర్శి గౌని పాతిరెడ్డి వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా కోడూరు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా ఆర్.చంద్ర, గౌరవాధ్యక్షుడిగా త్రిమూర్తి, ఉపాధ్యక్షులుగా రవీంద్రారెడ్డి, రాజశేఖర్, ఉషారాణి, రాందాస్ నాయక్, బలరాముడు, కార్యదర్శులుగా లతారామకృష్ణ, ఆదిబయన్న, భానుప్రియ, నాగరాజు, యంజారప్ప, శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిలర్లుగా అంజనమూర్తి, జయరాంరెడ్డి, నరసింహారెడ్డి, ముత్యాలప్ప, వాసుకుమార్, రవికుమార్, రమణారెడ్డి, సంగీత, కృష్ణవేణిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
హైవేకు మరమ్మతులు
హైవేకు మరమ్మతులు
హైవేకు మరమ్మతులు


