● అ‘పూర్వ’ సమ్మేళనం
పెనుకొండ: స్థానిక ప్రభుత్వ కళాశాలలో 1990–93లో డిగ్రీ బీఏ చదివిన వారు అదే కళాశాల ఆడిటోరియం వేదికగా ఆదివారం కలుసుకున్నారు. ప్రస్తుతం వారు ఎక్కడున్నది, ఏంచేస్తున్నారన్న విషయాలను పరస్పరం అడిగి తెలుసుకున్నారు. నాటి అల్లర్లు, చిలిపి పనులు గుర్తు చేసుకుని మురిసిపోయారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి అధ్యాపకులు విశ్వనాథరెడ్డి, గోవిందరెడ్డి, గోపాల్ తదితరులను సన్మానించారు. భవిష్యత్తులో కళాశాల అభివృద్ధికి చేయూతనందిస్తామని ప్రకటించారు. కార్యకమానికి పూర్వ విద్యార్థులు రామకృష్ణ, సిద్ధయ్య, హఫీజ్, ఆయిల్ కృష్ణారెడ్డి, బోయ నరసింహ, మహేష్‌రెడ్డి, టీచర్ సంజీవరాయుడు, టీచర్ వెంకటేసులు, జయశ్రీ, సుకన్య, కల్పన, లక్ష్మీకాంతమ్మ, సుజాత, యశోద, మంజుల, అనిత తదితరులు నేతృత్వం వహించారు.


