హక్కులపై అవగాహన కల్పించాలి
హిందూపురం: విద్యార్థులకు హక్కులపై అవగాహన కల్పిస్తూ.. బాధ్యతల పట్ల కూడా దిశానిర్దేశం చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ అన్నారు. శనివారం ఆయన హిందూపురంలోని ఎల్‌ఆర్‌జీ పబ్లిక్ స్కూల్ డే కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటికీ న్యాయానికి, చట్టానికి లోబడి జీవించడమే నిజమైన గొప్ప జీవితమని చెప్పారు. చట్టమే అందరికీ మార్గదర్శకమన్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఎంతో సావధానంగా సమాధానాలిచ్చారు. విద్యార్థులు న్యాయవ్యవస్థ పనితీరు, చట్టాల గురించి తెలుసుకోవాలని సూచించారు. న్యాయవ్యవస్థపై మరింత గౌరవాన్ని పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి అవధానం హరిహరనాథ శర్మ


