నేషనల్ హైవే.. నాలుగేళ్లకే శిథిలం
పరిగి: నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించిన ఎన్‌హెచ్ –544ఈ రహదారి నాలుగేళ్లకే శిథిలావస్థకు చేరుకుంది. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు నుంచి కర్ణాటక ప్రాంతమైన శిర వరకూ ఎస్సార్‌సీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టారు. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన నేషనల్ హైవే నాలుగేళ్లకే శిథిలావస్థకు చేరుకోవడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిగి– ధనాపురం మధ్యలో నిర్మించిన వంతెన కూడా శిథిలావస్థకు చేరింది. రహదారిపై నెర్రెలు చీలి, వంతెన సైడ్‌వాల్ బీటలువారింది. పరిగి మండలంలోనే ఇలా ఉంటే హిందూపురం, పెనుకొండ, మడకశిర ప్రాంతాల్లోనూ నేషనల్ హైవే –544ఈ నిర్మాణ పనులు మరెంత అధ్వానంగా చేశారోనన్న అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.
నేషనల్ హైవే.. నాలుగేళ్లకే శిథిలం
నేషనల్ హైవే.. నాలుగేళ్లకే శిథిలం


