జగనన్న సాయం.. ఇవీ నిదర్శనాలు..
రైతు కుటుంబానికి ఎంతో లబ్ధి
ఇతను హిందూపురం మండలంలోని కిరికెర గేటుకు చెందిన నారాయణరెడ్డి. 2020 సంవత్సరంలో పాము కాటుకు గురయ్యాడు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఆ సమయంలో స్థానికంగానూ ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి. అత్యవసర పరిస్థితి కావడంతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో రూ.లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించాల్సి వచ్చింది. ఆర్థికంగా అంతంతమాత్రంగానే ఉన్న నారాయణరెడ్డి ఆ తర్వాత తనను ఆదుకోవాలని సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. మానవత్వంతో ఆలోచించిన అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే రూ.3.60 లక్షల ఆర్థిక సాయం అందించారు. అలాగే నారాయణరెడ్డి సోదరుడు సైతం అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోగా... సీఎం సహాయ నిధి ద్వారా సాయం అందించారు. జగనన్న చేసిన మేలు జీవితంలో మరచిపోలేనని నారాయణరెడ్డి కృతజ్ఞతతో చెబుతున్నారు.
– హిందూపురం టౌన్:
ఈ చిత్రంలో కన్పిస్తున్నది మహిళా రైతు జయమ్మ కుటుంబం. రొళ్ల మండలం దొమ్మరహట్టి గ్రామం. ఈ కుటుంబం వైఎస్ జగన్ హయాంలో ఎంతో లబ్ధి పొందింది. ఈ కుటుంబానికి 2.75 ఎకరాల వ్యవసాయ భూమి మాత్రమే ఉంది. ఆర్థిక ఇబ్బందులతో వ్యవసాయాన్ని కూడా చేయలేక సతమతమవుతున్న రోజుల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఆ కుటుంబానికి కలిసొచ్చింది. పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడిన జయమ్మ కుటుంబానికి వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలు వరంగా మారాయి. ప్రధానంగా వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ తదితర పథకాలతో లబ్ధి పొందిన జయమ్మ కుటుంబం మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుకుంది. రైతు భరోసా కింద రూ.67 వేల లబ్ధి కలిగింది. రూ.48 వేల ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చింది. సున్నా వడ్డీ కింద రూ.13 వేలు అందింది. ఇవే కాకుండా వైఎస్సార్ పెన్షన్ కానుక కింద రూ.1.76 లక్షల వరకు వచ్చింది. వైఎస్సార్ చేయూత కింద కూడా జయమ్మకు రూ.75 వేల లబ్ధి కల్గింది. జయమ్మ కోడలు సువర్ణ బీఫార్మసీ, తర్వాత ఎంఫార్మసీ చదివింది. రూ.3.35 లక్షల వరకు ఫీజురీయింబర్స్‌మెంట్ అందింది. వసతి దీవెన కింద రూ.80 వేలు జమ అయింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.8లక్షలకు పైగా మా కుటుంబానికి ఆర్థిక లబ్ధి కలిగినట్లు మహిళా రైతు జయమ్మ తెలిపింది. ‘వైఎస్ జగన్ రాక ముందు ఆర్థిక ఇబ్బందులతో వ్యవసాయాన్ని మానుకోవాలని నిర్ణయం తీసుకున్నా. అంతలోనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. మా కుటుంబానికి మంచి రోజులు మొదలయ్యాయి. ఎన్నో పథకాల ద్వారా లబ్ధి కలగడంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడ్డాం. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రైతులు బాగుపడతారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు.’ అని జయమ్మ అన్నారు.
– మడకశిర:
మాది సాధారణ రైతు కుటుంబం. నాన్న జూటరు హరినాథ్‌రెడ్డి రెక్కల కష్టంతోనే కుటుంబం గడుస్తుంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో నేను తిరుపతి అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ (ఏఐ) చదివాను. నాలుగేళ్లూ ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్‌మెంట్ చేసింది. ప్రస్తుతం పేరొందిన కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం దక్కింది. మా కుటుంబమంతా ఆనందంగా ఉంది. నా ఇంజినీరింగ్ కల నెరవేర్చిన జగనన్నకు రుణపడి ఉంటా. ఆయన మరోసారి అధికారం చేపట్టి నాలాంటి ఎందరికో మేలు చేయాలని కోరుకుంటున్నా.
– జె.లిఖిత, గూనిపల్లి, బుక్కపట్నం మండలం
చేనేతలకు చేయూత
ధర్మవరం: గత పాలకులు నిర్వీర్యం చేసిన చేనేత రంగానికి వైఎస్ జగనన్న చేయూత నిచ్చారు. తన ఐదేళ్ల పాలనలో నేతన్నలకు అండగా నిలిచి ఎంతో మేలు చేశారు. చేనేతలు అత్యధికంగా నివసించే ధర్మవరం నియోజకవర్గంలో 1,04,305 కుటుంబాలుండగా...97,244 మందికి (93 శాతం) ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించారు. నవరత్న పథకాల ద్వారా రూ.3,024 కోట్లు అందజేశారు. పిల్లల చదువులకు ‘అమ్మ ఒడి’ దగ్గర నుంచి నేతన్న నేస్తం, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, వైఎస్సార్ చేయూత తదితర పథకాలతో ఆదుకున్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న ఒక్కో చేనేత కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేసి ఆదుకుంటామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న 70 మంది చేనేతల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అర్హులైన వారికి ఇంటి పట్టాలతో పాటు గృహ నిర్మాణ సౌకర్యం కల్పించారు.
ఇంజినీరింగ్ కల
జగనన్న సాయం.. ఇవీ నిదర్శనాలు..
జగనన్న సాయం.. ఇవీ నిదర్శనాలు..
జగనన్న సాయం.. ఇవీ నిదర్శనాలు..


