బాగు‘బడి’ంది ఆనాడే
మా స్కూల్‌కు
జగన్ మామ వన్నె తెచ్చారు
2019కి ముందు ప్రభుత్వ పాఠశాలలో చదవాలంటే చాలా మంది భయపడే వారు. వసతులు సరిగా ఉండవని అనుకునేవారు. కానీ జగన్ మామ సీఎం అయిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు అందంగా తయారయ్యాయి. మా పాఠశాలే ఇందుకు నిదర్శనం. ప్రైవేటు స్కూళ్ల కంటే మిన్నగా మా స్కూల్లో వసతులు ఉన్నాయి. బెంచీలు, బ్లాక్ బోర్డులు, డిజిటల్ టీవీలు ఏర్పాటు చేశారు. పైగా అమ్మఒడి పథకం ద్వారా చదువుకునేందుకు డబ్బులిచ్చారు.
– అఖిల్, 9వ తరగతి, సిద్ధరాంపురం
ఉన్నత పాఠశాల
పుట్టపర్తి: బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం జెడ్పీ హైస్కూల్‌లో 280 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో గతంలో పలు సమస్యలు ఉండేవి. అయితే.. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు మనబడి నాడు–నేడు పథకం మొదటిదశలో మౌలిక సదుపాయాలు కల్పించారు. తాగునీటికి ఆర్‌ఓ ప్లాంటు, సరిపడినన్ని మరుగుదొడ్లు, ప్రతి తరగతి గదిలో రెండు చొప్పున ఫ్యాన్లు, బ్లాక్‌బోర్డు, డిజిటల్ బోధన కోసం టీవీలు ఏర్పాటు చేశారు. మొత్తమ్మీద రూ.43 లక్షలతో పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
బాగు‘బడి’ంది ఆనాడే


