ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్
పెనుకొండ రూరల్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రతులను విజయవాడకు పంపే కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తిలో చేపట్టిన ర్యాలీ విజయవంతమైందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పేర్కొన్నారు. ర్యాలీ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో చంద్రబాబు ప్రభుత్వం పేదలకు తీరని అన్యాయం చేస్తోందన్నారు. సామన్యులకు నాణ్యమైన వైద్యంతో పాటు సామాన్య విద్యార్థులకు వైద్య విద్యను అందించేందుకే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించిందన్నారు. పార్టీలకు అతీతంగా సంతకాలు చేశారన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు సర్కార్ ప్రజల మనోభావాలను గౌరవించాలన్నారు.
శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు
కదిరి టౌన్: శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకలను మంగళవారం లెక్కించినట్లు ఆలయ ఈఓ వెండిదండి శ్రీనివాసరెడ్డి తెలిపారు.70 రోజులకుగాను నగదు రూ.1,17,44,339, బంగారు 23 గ్రాములు, వెండి 753 గ్రాముల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే అమెరికా డాలర్లు 24, ఓమన్ 2, కెనడా 10, శ్రీలంక 100 డాలర్లు వచ్చాయన్నారు. గతంలో కంటే ఈసారి ఆదాయం ఎక్కువ వచ్చిందని వివరించారు. ఈ కార్యక్రమంలో హుండీల పర్యవేక్షాణాధికారి నరసింహరాజు, కెనరా బ్యాంక్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఉచిత శిక్షణకు
దరఖాస్తుల ఆహ్వానం
పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఇచ్చే ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జాబ్స్ కోఆర్డినేటర్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు 90 రోజుల పాటు స్పోకెన్ ఇంగ్లిష్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్‌నెట్ స్కిల్స్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ సమయంలో భోజనం, వసతి, యూనిఫాం ఇస్తారన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్‌తో పాటు ప్రైవేటు సంస్థల్లో కచ్చితంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని తెలియజేశారు. అనంతపురంలోని టీటీడీసీలో ఈనెల 18 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు సెల్ నంబర్ 9640899337 ను సంప్రదించాలన్నారు.
జాతీయ స్థాయి
ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక
అనంతపురం కార్పొరేషన్: ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు గుంటూరు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో అనంతపురంజిల్లాకు చెందిన ఐదుగురు ఫెన్సర్లు రాణించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. వీరిలో గీతిక, చేతన, లిఖిత, నవనీత్, సాత్విక్ ఉన్నారు. మణిపూర్‌లో త్వరలో జాతీయస్థాయి పోటీలు జరగనున్నాయని, ఇందులోనూ జిల్లా క్రీడాకారులు రాణించాలని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి శ్రీనివాసులు, ఫెన్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి మురళీకృష్ణ ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులను మంగళవారం అనంతపురంలోని కార్యాలయంలో అభినందించారు.
ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు


