ప్రజాస్వామ్య విలువలు పతనం
హిందూపురం వైఎస్సార్ సీపీ కార్యాలయంపై దాడి టీడీపీ రౌడీయిజానికి నిదర్శనం. పట్ట పగలే టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ కార్యాలయంలోకి చొరబడి ఫర్నీచర్, కుర్చీలు, అద్దాలు ధ్వంసం చేయడం, కార్యాలయంలోని వారిపై భౌతిక దాడులకు పాల్పడటం హేయం. పోలీసుల సమక్షంలో జరిగిన ఈ దాడి చూస్తుంటే ప్రజాస్వామ్య విలువలు పతనమైనట్టు కనిపిస్తోంది. ప్రశాంతంగా ఉన్న హిందూపురంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు టీడీపీ గూండాలు తెరలేపారు. ఇప్పటికే హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రం మరో బిహార్‌లా మారింది. టీడీపీ నేతలు ఆటవిక చర్యలకు స్వస్తి పలకాలి. లేనిపక్షంలో దీటుగా సమాధానం చెప్తాం.
– మాలగుండ్ల శంకరనారాయణ, పొలిటికల్
అడ్వయిజరీ కమిటీ మెంబర్, వైఎస్సార్ సీపీ
ప్రజాస్వామ్య విలువలు పతనం


