బిర్సా ముండా జీవితం ఆదర్శప్రాయం
● కలెక్టర్ శ్యాంప్రసాద్
● ఘనంగా జన్ జాతీయ గౌరవ్ దివస్
ప్రశాంతి నిలయం: స్వాతంత్య్ర సమరయోధుడు, గిరిజన వీరుడు బిర్సా ముండా జీవితం ఆదర్శ ప్రాయమని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌లో ‘జన్ జాతీయ గౌరవ్ దివస్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ఆ మహానాయకుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన బిర్సా ముండాను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, కలెక్టరేట్ ఏఓ వెంకటనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధికారి మోహన్ రావు, ఎస్‌డీసీ రామసుబ్బయ్య తదితరలు పాల్గొన్నారు.
‘సాయి 100’ యాప్‌లో సమగ్ర సమాచారం
ప్రశాంతి నిలయం: సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రశాంతి నిలయం విచ్చేసే భక్తులకు సమాచారం అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ‘సాయి 100’ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉత్సవాల్లో రోజువారీ కార్యక్రమాల వివరాలు, వాహనాల పార్కింగ్, వసతి, కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలతో పాటు భక్తులకు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని యాప్ ద్వారా తెలుసుకోవచ్చని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ శనివారం తెలిపారు. భక్తులు యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సత్యసాయి సేవలు వెలకట్టలేనివి
● కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ప్రశాంతి నిలయం: పుట్టపర్తి సత్యసాయి బాబా విద్య, వైద్య, తాగునీటి రంగాలలో మానవాళికి అందించిన సేవలు వెలకట్టలేనివని కేంద్ర వాణిజ్య ,పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కొనియాడారు. శనివారం ఆయన ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి విచ్చేసి..బాబా శత జయంతి వేడుకలలో పాల్గొన్నారు. సాయికుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి ‘అందరినీ సేవించు–అందరినీ ప్రేమించు’ అంటూ ఇచ్చిన నినాదం కోట్లాది మంది భక్తులను సేవామార్గం వైపు నడిపిందన్నారు. ఆయన చేసిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. సత్యసాయి భక్తుల మదిలో ఎప్పుడూ కొలువై ఉంటారన్నారు.
బిర్సా ముండా జీవితం ఆదర్శప్రాయం
బిర్సా ముండా జీవితం ఆదర్శప్రాయం


