ఉరుకులు.. పరుగులు!
గుంతకల్లు: తిమ్మనచర్ల రైల్వేస్టేషన్ సమీపంలోని డంపింగ్ యార్డులో శుక్రవారం ఉదయం 8.40 గంటల సమయంలో సైరన్ మోగింది. ఇంతలో లింగంపల్లి – తిరుపతి ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది’ అంటూ మైక్‌లో అనౌన్స్‌మెంట్. అంతే క్షణాల్లో అక్కడకు యాక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్‌తోపాటు 108 అంబులెన్స్‌లు, ఫైరింజన్‌లు వచ్చేశాయి. ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ, సివిల్ పోలీసులతోపాటు ఆపరేటింగ్, సేఫ్టీ, ఇంజినీరింగ్, కమర్షియల్, మెడికల్, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది.. ఇలా అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఉరుకులు, పరుగులతో చేరుకున్నారు. బోగీ కిటికీలు కట్ చేసి క్షతగాత్రులను స్ట్రెచర్‌పై బయటకు తీసుకురావడం.. అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలించడం..ఫైరింజన్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడం.. ఇదంతా చూస్తున్న వారికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఇది ‘మాక్ డ్రిల్’ అని డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా ప్రకటించగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
పట్టాలు తప్పిన ప్యాసింజర్
సహాయక చర్యల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్,
ఆర్‌ఫీఎఫ్ బృందాలు
మూడు గంటల హడావుడి తర్వాత ‘మాక్‌డ్రిల్’గా ప్రకటన
ఉరుకులు.. పరుగులు!


