అనుమతులు కొంత.. అక్రమం కొండంత
● పుట్టపర్తిలో విచ్చలవిడిగా నిర్మాణాలు
● రెండంతస్తులకు అనుమతులు..
నిర్మించేది పది పైనే
● భవన నిర్మాణ మెటీరియల్‌తో
ఇబ్బందుల్లో వాహనదారులు
● రోడ్డుకు అడ్డంగా కొత్త నిర్మాణాలు చేపట్టినా చర్యలు శూన్యం
● నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా భవన నిర్మాణాలు
సాక్షి, పుట్టపర్తి: ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో భవన నిర్మాణదారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. భద్రతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చేశారు. అనుమతి ఒకలా.. నిర్మాణాలు మరోలా అన్నట్టు ఆకాశాన్ని తాకేలా భవంతులు నిర్మిస్తున్నారు. వ్యాపారాల పేరుతో పార్కింగ్ స్థలాలు కూడా లేకుండా చేశారు. భగవాన్ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకునేందుకు భక్తులు పుట్టపర్తి వరకు సులువుగా వస్తారు. కానీ అక్కడి నుంచి ప్రశాంతినిలయం చేరుకోవడం గగనంగా మారింది. ఆర్టీసీ బస్టాండు నుంచి అక్రమ కట్టడాల కారణంగా ట్రాఫిక్ సమస్య, ఇరుకై న రోడ్లు, పార్కింగ్ వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు పక్కన పెడితే.. కూటమి ప్రభుత్వంలో అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల కొత్త నిర్మాణాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి.
అడిగేవారు లేరని అడ్డదిడ్డంగా నిర్మాణాలు
పుట్టపర్తిలో అక్రమ కట్టడాలు వందకు పైగా ఉంటాయి. కొన్ని సందుల్లో ఎండ కూడా పడనంతగా భవనాలు నిర్మించారు. ఏదైనా ప్రమాద ఘటన జరిగితే కనీసం ఫైరింజన్ కూడా వెళ్లలేని పరిస్థితి. రూ.కోట్లు విలువ చేసే హోటళ్లకు పార్కింగ్ వ్యవస్థ లేదు. ఎవరైనా వీఐపీలు ఆ హోటల్‌కు వస్తే.. వాహనాలన్నీ రోడ్డు పైనే. ఏ భవనం చూసినా రెండంతస్తులకు అనుమతులు తీసుకుంటారు. ఆ తర్వాత పది అంతస్తుల వరకు అక్రమంగా నిర్మిస్తారు. అయినా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొన్ని వీధుల్లోకి కనీసం జీపు కూడా వెళ్లలేని స్థితి. అలాంటి సందుల్లో పదంతస్తుల భవనాలు దర్శనం ఇవ్వడం గమనార్హం.
ఇరకాటంలోనూ ఇష్టారాజ్యంగా..
జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని ఆర్టీసీ బస్టాండు నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ప్రధాన మార్గం ఇరుకుగా ఉంది. రోడ్డుకు ఇరువైపులా వ్యాపార కేంద్రాలు, హోటళ్లు, దుకాణాలు, మార్కెట్‌లు వెలిశాయి. సుమారు 90 శాతం అక్రమ కట్టడాలే. ఏ భవనానికీ పార్కింగ్ వ్యవస్థ ఉండదు. పైగా ఉన్నఫళంగా పైన అంతస్తులు నిర్మిస్తుంటారు. రోడ్డు మీదనే మెటీరియల్ ఉంచి వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అడిగేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
పట్టించుకోని మున్సిపల్ అధికారులు
అనుమతులు కొంత.. అక్రమం కొండంత
అనుమతులు కొంత.. అక్రమం కొండంత
అనుమతులు కొంత.. అక్రమం కొండంత
అనుమతులు కొంత.. అక్రమం కొండంత


