
ప్రశాంతి నిలయంలో గుజరాత్ వైభవం
ప్రశాంతి నిలయం: గుజరాత్ నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతి నిలయంలో వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు బుధవారం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత గుజరాత్ భక్తులు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నవ్‌సారికి చెందిన శ్రీ సత్యసాయి విద్యానికేతన్ స్కూల్‌కు విద్యార్థులు తమ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే డాంగీ జానపద నృత్యాన్ని ప్రదర్శించారు. చక్కటి నృత్య భంగిమలతో భక్తులను ఆకట్టుకున్నారు. అనంతరం గుజరాత్ బాలవికాస్ చిన్నారులు ‘దీపావళి ఏ టేల్ ఆఫ్ రామాస్ ల్యాంప్ కీపర్’ పేరుతో నాటికను ప్రదర్శించారు. అలనాటి రాముడు, నేటి సత్యసాయి భక్తుల పట్ల చూపిన వాత్సల్యాన్ని, భక్తులకు తోడు, నీడగా ఉన్న వైనాన్ని చక్కగా ప్రదర్శించారు. అంతకుముందు ఉదయం సత్యసాయిని కీర్తిస్తూ సంగీత విభావరి నిర్వహించారు. చిన్నారులు నృత్య ప్రదర్శన నిర్వహించారు.

ప్రశాంతి నిలయంలో గుజరాత్ వైభవం