
జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
పెనుకొండ రూరల్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, అధికారులకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పండగ వేళ ప్రతి ఒక్కరి జీవితాల్లో అమావాస్య చీకట్లు తొలగిపోయి.. వెలుగులు నిండాలని పేర్కొన్నారు. సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
కాంతులు నింపాలి
పుట్టపర్తి టౌన్: చీకటిపై వెలుగు సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకొంటున్న దీపావళి అందరి జీవితాల్లో కాంతులు నింపాలని జిల్లా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్ ఆక్షాంక్షించారు. దీపావళి సందర్భంగా జిల్లా ప్రజలకు వారు వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు.
మోసగాడిపై కేసు
రామగిరి: పింఛన్లు, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బు వసూలు చేసి మోసగిస్తున్న టీడీపీ వర్గీయుడు సదాశివపై రామగిరి పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. రామగిరి మండలం దుబ్బార్లపల్లికి చెందిన సదాశివ తన పింఛన్ పునరుద్ధరింపజేస్తానంటూ రెండు విడతలుగా రూ.24 వేలు ఇప్పించుకుని మోసం చేశాడని రామగిరికి చెందిన శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సదాశివ ఆగడాలపై ఈ నెల 15న ‘సాక్షి’ దినపత్రికలో ‘సదా మోసమే’ శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం విదితమే. కలెక్టరేట్ ఏఎస్‌ఓనని చెప్పుకుంటూ పలువురి నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. అనంతపురం, పెనుకొండ, హిందూపురం, పుట్టపర్తి తదితర ప్రాంతాలలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను, పింఛన్ ఇప్పిస్తానంటూ అమాయకులను మోసగించాడు. ఇప్పటికే ఇతనిపై పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
తాటిమానుగుంతలో
తాగునీటికి కటకట
ఎన్‌పీకుంట మండలంలో మారుమూల గ్రామమైన తాటిమానుగుంతలో తాగునీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ బోరు మోటారు చెడిపోయి..పదిహేను రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామంలో చాలా మంది వ్యవసాయ కూలి పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ క్రమంలో తాగునీటి కోసం పనులు మానుకుని బోరుబావుల వద్ద నీళ్లు వదిలినప్పుడు బిందెల్లో పట్టుకోవడానికి పోటీపడుతున్నారు. తమ పొలాలకు నీళ్లు వదులుకోవాలని రైతులు అభ్యంతరం చెబుతుండడంతో ఒకట్రెండు బిందెలతో సర్దుకోవాల్సి వస్తోంది. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికై నా స్పందించాలని కోరుతున్నారు.
– ఎన్‌పీకుంట:

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు