
రైతులంటే అంత అలుసా?
పంట వేద్దామంటే విత్తనాలు, ఎరువులు ఇవ్వరు. ఎలాగోలా కష్టపడి పంట పండిస్తే గిట్టుబాటు ధర కల్పించరు. కూటమి సర్కారుకు రైతు సంక్షేమం పట్టడం లేదు. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమే. రైతులు యూరియా కోసం బారులు తీరితే భోజనం కోసం నిలబడ్డారంటూ మంత్రి అచ్చెన్నాయుడు హేళనగా మాట్లాడారు. రైతు కష్టం తెలియని ఆయన వ్యవసాయశాఖ మంత్రిగా పనికి రారు. వెంటనే పదవికి రాజీనామా చేయాలి. రైతుల సమస్యను ప్రభుత్వానికి తెలియజెప్పేందుకే వైఎస్సార్ సీపీ ‘అన్నదాత పోరు’ నిర్వహించింది. విజయవంతం చేసిన కార్యకర్తలకు, రైతులకు ధన్యవాదాలు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలి.
– ఉషశ్రీచరణ్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు