
సంక్షోభంలో వ్యవసాయం
కూటమి పాలనలో వ్యవసాయం సంక్షోభంలోకి పడింది. ప్రభుత్వ సాయం కరువై రైతన్నలు ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. చివరకు యూరియా కూడా పంపిణీ చేయకపోవడంతో రైతులు బారులు తీరిన దుర్భర పరిస్థితులు దాపురించాయి. దీనికి సిగ్గుపడాల్సిన వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు బఫేల వద్ద భోజనాల కోసం నిలబడ్డారంటూ రైతులను అవమానించారు. నిజంగా ఇది సిగ్గుచేటు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఆర్‌బీకేల ద్వారా ఎప్పటికప్పుడు యూరియా, ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచిన జగనన్న.. రైతాంగానికి దన్నుగా నిలిచారు. ఇప్పటికై నా ఈ పాలకులు రైతుకు అండగా నిలబడాలి.
– కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి,
వైఎస్సార్ సీపీ ధర్మవరం సమన్వయకర్త