
చేతగాకపోతే దిగిపోండి
కూటమి సర్కారు ఏడాదిన్నర పాలనలో ఏ వర్గానికీ న్యాయం చేయలేకపోయింది. కనీసం రైతులకు యూరియా కూడా ఇవ్వలేక పోవడం దుర్మార్గం. ఉచిత విద్యుత్ కోసం ధర్నా చేసిన రైతులపై గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు.. ఇప్పటికీ అదే పంథాలో పాలన సాగిస్తున్నారు. ఏసీ రూముల్లో సమీక్షలు చేస్తూ తాను అనుభవజ్ఞుడినని గొప్పలు చెబుతున్నారు. అసలు రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు వేశారు. ఎంత మేర ఎరువులు కావాలో కూడా తెలియకుండా పాలన సాగిస్తున్నారా...? మీకు ఓటు వేసిన పాపానికి రైతులు రోడ్లెక్కాలా...? పాలన చేతగాకపోతే దిగిపోండి.
– దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి,
వైఎస్సార్ సీపీ పుట్టపర్తి సమన్వయకర్త