
రీసర్వేతో భూములు గుర్తించడం సులభం
హిందూపురం: భూమి సర్వేనంబర్లు గుర్తించాడన్ని హక్కుదారులకు సులభతరం చేయడానికే ప్రభుత్వం రీసర్వే చేస్తోందని జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ అన్నారు. గురువారం హిందూపురం మండలంలోని తూమకుంట పంచాయతీ పరిసరాల్లో భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అడంగళ్ ఆధారంగా సర్వేనంబర్లు భూమి విస్తీర్ణం వంటి వివరాలను రెవెన్యూఅధికారులు, రికార్డులను పరిశీలించారు.
లేపాక్షి: లేపాక్షి పంచాయతీలో జరుగుతున్న భూ రీసర్వేను జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ గురువారం పరిశీలించారు. ఎంతమేరకు సర్వే నిర్వహించారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది బదిలీపై వెళ్లడంతో కొత్త టీంను పెనుకొండ, హిందూపురం మండలాల నుండి నియమించి రీసర్వేను వేగవంతం చేయాలని తెలిపారు.
రాజకీయ పార్టీలతో సమావేశం..
హిందూపురం: ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, సమర్థత, ప్రజల నైతిక భాగస్వామ్యం పెంపొందించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తోందని ఎలెక్షన్ రిజిస్ట్రేషన్ అధికారి, జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ అన్నారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని రాజకీయపార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కొత్తగా ఏర్పాటు చేయాల్సిన పోలింగ్ స్టేషన్లు, బూత్ రేషనలైజేషన్, తదితర వాటిపై చర్చించారు. ఫారమ్ 6 ద్వారా 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు ఓటుహక్కు నమోదు చేసుకోవచ్చునన్నారు. పార్టీల ప్రతినిధులు తమ ప్రాంతాల్లో పౌరులకు అవగాహన కల్పించి ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం పొందేలా కృషిచేయాలని సూచించారు.కార్యక్రమములో తహసీల్దార్లు వెంకటేష్, సౌజన్యలక్ష్మి, నటరాజ్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, డిప్యూటీ తహసీల్దార్ మైనుద్దీన్, ఆర్‌ఐ అమరేంద్ర తదితరులు పాల్గొన్నారు.